ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Kusal Mendis: బంగ్లాతో 2nd టెస్ట్‌లో మ్యాచ్ ఆడుతూ గ్రౌండ్‌లో కూలబడిపోయిన కుషాల్ మెండిస్.. ఏమైందంటే..

ABN, First Publish Date - 2022-05-23T22:06:26+05:30

బంగ్లాదేశ్ జట్టుతో సెకండ్ టెస్ట్ ఆడుతున్న శ్రీలంక క్రికెటర్ కుషాల్ మెండిస్ మ్యాచ్ ఆడుతున్న సమయంలో అస్వస్థతకు లోనయ్యాడు. జయవిక్రమ 23వ ఓవర్‌లో బౌలింగ్ చేస్తుండగా..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఢాకా: బంగ్లాదేశ్ జట్టుతో సెకండ్ టెస్ట్ ఆడుతున్న శ్రీలంక క్రికెటర్ కుషాల్ మెండిస్ మ్యాచ్ ఆడుతున్న సమయంలో అస్వస్థతకు లోనయ్యాడు. జయవిక్రమ 23వ ఓవర్‌లో బౌలింగ్ చేస్తుండగా ఫీల్డింగ్‌ చేస్తున్న Kusal Mendis ఇబ్బందికి లోనయ్యాడు. ఛాతిలో నొప్పిగా ఉందంటూ కిందపడిపోయి ఇబ్బందిపడ్డాడు. దీంతో.. శ్రీలంక మెడికల్ స్టాఫ్ హుటాహుటిన మెండిస్ దగ్గరకు వచ్చి అతనిని పరీక్షించారు. డాక్టర్ మంజూర్ హుస్సేన్ చౌదరి మాట్లాడుతూ.. మెండిస్ అనారోగ్య సమస్యను గుర్తించేందుకు వైద్య పరీక్షల నిమిత్తం అతనిని ఆసుపత్రికి తీసుకెళ్లినట్టు చెప్పారు.


మెండిస్ అనారోగ్యానికి కారణం ఏంటనే విషయంలో స్పష్టత లేదు గానీ కండరాల నొప్పి (Muscle Spasms) కారణం అయి ఉండొచ్చని శ్రీలంక జట్టుకు మేనేజర్‌గా వ్యవహరిస్తున్న మహీంద హలంగొడ చెప్పారు. మెండిస్‌ ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నట్లు తెలిపారు. అనారోగ్యం కారణంగా ఈ టెస్ట్ మ్యాచ్‌లో మెండిస్ కొనసాగకపోవచ్చనే ప్రచారం మొదలైంది. బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్ట్‌లో శ్రీలంక ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 54 పరుగులతో హాఫ్ సెంచరీ, శ్రీలంక సెకండ్ ఇన్నింగ్స్‌లో 48 పరుగులు చేసి కుషాల్ మెండిస్ మ్యాచ్ డ్రాగా ముగియడంలో కుషాల్ మెండిస్ కీలక పాత్ర పోషించాడు.

Updated Date - 2022-05-23T22:06:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising