ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

IPL: వైరల్ అవుతున్న ఉమ్రాన్ మాలిక్ ఫొటో.. ఈ దణ్ణం ఏంటో.. అసలేం జరిగిందంటే..

ABN, First Publish Date - 2022-04-28T19:38:52+05:30

రషీద్, హార్థిక్, ఉమ్రాన్ మాలిక్ కలిసి ఉన్న ఫొటో ఒకటి తాజాగా వైరల్ అవుతోంది. ఆ ఫొటోలో SRH బౌలర్ ఉమ్రాన్ మాలిక్ ఎవరికో..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

IPL 2022లో భాగంగా Sunrisers Hyderabad, Gujarat Titans జట్ల మధ్య బుధవారం (ఏప్రిల్ 27) రాత్రి ఉత్కంఠభరిత మ్యాచ్ జరిగింది. ఆద్యంతం ఆసక్తికరంగా సాగిన ఈ మ్యాచ్‌లో Gujarat Titans టీం విజయం సాధించింది. అయితే.. ఈ మ్యాచ్‌ అనంతరం రషీద్, హార్థిక్, ఉమ్రాన్ మాలిక్ కలిసి ఉన్న ఫొటో ఒకటి తాజాగా వైరల్ అవుతోంది. ఆ ఫొటోలో SRH బౌలర్ ఉమ్రాన్ మాలిక్ ఎవరికో చేతులెత్తి దణ్ణం పెడుతున్నాడు. హార్థిక్ పాండ్యా భార్యను క్షమించమని చేతులెత్తి వేడుకుంటున్నాడని సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.



ఆ ఫొటోపై మీమ్స్ కూడా వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు అలా భావించడానికి కారణం లేకపోలేదు. ఉమ్రాన్ వేసిన 8వ ఓవర్ నాలుగో బంతికి శుభ్‌మన్ గిల్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఉమ్రాన్ బౌలింగ్ గురించి తెలిసిందే కదా. ఉమ్రాన్ వేసే బంతి 145kph నుంచి 150 kph వేగంతో తుఫానులా దూసుకొస్తుంటుంది. గిల్ ఔట్ అవగానే హార్థిక్ పాండ్యా బ్యాటింగ్‌కు దిగాడు. ఉమ్రాన్ యధావిధిగా బంతిని మెరుపు వేగంతో బౌలింగ్ చేశాడు. ఉమ్రాన్ వేసిన ఆ బంతి 145.4kph వేగంతో హార్థిక్ పాండ్యా కుడి భుజానికి తగిలింది. ఆ స్పీడ్‌తో వచ్చి బంతి తగిలితే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదనుకుంటా. పాపం.. హార్థిక్ పాండ్యా విలవిలలాడిపోయాడు. భర్తకు దెబ్బ తగిలితే ఏ భార్య అయినా బాధపడకుండా ఉంటుందా.



మ్యాచ్‌ను స్టేడియానికి వెళ్లి వీక్షిస్తున్న హార్థిక్ భార్య  నటాషా కూడా ‘ఇలా జరిగిందేంటి’ అనే రీతిలో రియాక్షన్ ఇచ్చింది. మ్యాచ్ అనంతరం ఇరు జట్ల ఆటగాళ్లు సరదగా కలిసి ముచ్చటించుకున్నారు. ఆ సమయంలో రషీద్, హార్థిక్, ఉమ్రాన్ మాలిక్ కలిసి సరదగా గడిపారు. ఆ సమయంలో ఉమ్రాన్ చేతులెత్తి దణ్ణం పెట్టి ‘Sorry’ అన్నట్టుగా నవ్వుతూ ఫేస్ పెట్టాడు. తను బౌలింగ్ చేసిన సమయంలో హార్థిక్ గాయపడినందుకు అతని భార్య నటాషాకు ‘Sorry’ చెబుతున్నట్లుగా ఆ ఫొటో ఉండటంతో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అయితే.. ఆ దెబ్బ తగిలిన కొద్దిసేపటికే పడి లేచిన కెరటంలా బ్యాటింగ్‌ చేసిన హార్థిక్ ఉమ్రాన్ వేసిన తరువాతి బంతిని ఫోర్ కొట్టాడు. ఆ తర్వాత హార్థిక్ పాండ్యా అదే ఉమ్రాన్ బౌలింగ్ చేసిన 10వ ఓవర్ రెండో బంతికి షాట్ కొట్టాలని యత్నించి క్యాచ్‌గా చిక్కి పెవిలియన్ బాట పట్టాడు. రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్ గుజరాత్ టైటాన్స్ టీంను విజయతీరాలకు చేర్చారు.

Updated Date - 2022-04-28T19:38:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising