ద్యూతీకి స్వర్ణం
ABN, First Publish Date - 2022-05-01T09:21:24+05:30
ద్యూతీకి స్వర్ణం
ఖేలో ఇండియా యూనివర్సిటీ క్రీడలు
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): ఖేలో ఇండియా యూనివర్సిటీ క్రీడల్లో మహిళల 100 మీటర్ల స్ర్పింట్‌లో స్టార్ అథ్లెట్ ద్యూతీ చంద్ స్వర్ణంతో మెరిసింది. బెంగళూరులో జరుగుతున్న ఈ పోటీల్లో శనివారం ముగిసిన 100 మీటర్ల పరుగులో ద్యూతి 11.68 సెకన్లలో రేసును పూర్తి చేసి విజేతగా నిలిచింది. తెలంగాణకు చెందిన దీప్తి ఏడో స్థానంతో సరిపెట్టుకుంది. ఇక, మహిళల టెన్నిస్ టీమ్ ఈవెంట్‌లో ఉస్మానియా విశ్వవిద్యాలయం (ఓయూ) జట్టు ఫైనల్‌కు దూసుకెళ్లింది.
Updated Date - 2022-05-01T09:21:24+05:30 IST