ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అంతర్జాతీయ క్రికెట్‌కు పొలార్డ్‌ గుడ్‌బై

ABN, First Publish Date - 2022-04-21T10:02:18+05:30

అంతర్జాతీయ క్రికెట్‌కు పొలార్డ్‌ గుడ్‌బై

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై: వెస్టిండీస్‌ స్టార్‌ క్రికెటర్‌, పరిమిత ఓవర్ల కెప్టెన్‌ కీరన్‌ పొలార్డ్‌ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించాడు. అయితే, ప్రస్తుతం ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌ తరఫున ఆడుతున్న పొలార్డ్‌.. ప్రైవేట్‌ టీ20, టీ10 లీగ్స్‌లో మాత్రం ఆడతానని బుధవారం తెలిపాడు. ‘అన్నింటినీ కూలంకషంగా పరిశీలించుకున్నాకే, అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాలని నిర్ణయం తీసుకున్నా. విండీస్‌ జాతీయ జట్టు తరఫున ఆడాలని పదేళ్ల వయసులోనే కలగన్నా. 15 ఏళ్లపాటు టీ20, వన్డేల్లో దేశానికి ఆడడం గర్వంగా ఉంది’ అని 34 ఏళ్ల పొలార్డ్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశాడు. విధ్వంసకర ఆటగాళ్లలో ఒకడిగా పేరు తెచ్చుకున్న పొలార్డ్‌.. 2007లో దక్షిణాఫ్రికాతో సిరీస్‌తో వన్డేల్లో అరంగేట్రం చేశాడు. ఆ మరుసటి ఏడాది ఆస్ట్రేలియాతో టీ20ల్లో ప్రవేశించాడు. 123 వన్డేలాడి 2706 పరుగులు చేసిన అతను.. 101 టీ20ల్లో 1569 రన్స్‌ సాధించాడు. బ్యాటింగ్‌ ఆల్‌రౌండరైన పొలార్డ్‌ టెస్టు క్రికెట్‌ మాత్రం ఆడలేదు. 2014 డిసెంబరులో వన్డే జట్టు నుంచి ఉద్వాసనకు గురైన పొలార్డ్‌.. 2016లో  పునరాగమనం చేశాడు. 2019లో జట్టు పగ్గాలు స్వీకరించిన పొలార్డ్‌.. రెండు ఫార్మాట్లలో కలిపి 61 మ్యాచ్‌లకు సారథ్యం వహించాడు. పొలార్డ్‌ హయాంలో విండీస్‌.. భారత్‌లో అఫ్ఘానిస్థాన్‌పై, స్వదేశంలో ఐర్లాండ్‌పై, ఇంటాబయటా శ్రీలంకపై, ఈ ఏడాది స్వదేశంలో ఇంగ్లండ్‌పై టీ20 సిరీ్‌సలు గెలిచింది. సిక్సర్లు సంధించడంలో దిట్ట అయిన పొలార్డ్‌.. 2021లో శ్రీలంకతో టీ20లో అకిల దనంజయ బౌలింగ్‌లో వరుసగా ఆరు సిక్సర్లు బాదాడు. దీంతో గిబ్స్‌, యువరాజ్‌ తర్వాత ఒకే ఓవర్లో ఆరు సిక్స్‌లు బాదిన మూడో క్రికెటర్‌గా నిలిచాడు. 2012లో టీ20 ప్రపంచకప్‌ నెగ్గిన విండీస్‌ జట్టులో పొలార్డ్‌ సభ్యుడు.  

Updated Date - 2022-04-21T10:02:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising