ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మార్చి 26 నుంచి ఐపీఎల్‌

ABN, First Publish Date - 2022-02-25T09:32:47+05:30

మెగా వేలం తర్వాత.. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీ ఎల్‌-2022 ప్రారంభతేదీని ప్రకటించారు. 10 జట్ల మెగా లీగ్‌ వచ్చే నెల 26న ముంబైలో ఆరంభం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మే 29న ఫైనల్‌ 

లీగ్‌ మ్యాచ్‌లన్నీ ముంబై, పుణెలోనే

న్యూఢిల్లీ: మెగా వేలం తర్వాత.. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీ ఎల్‌-2022 ప్రారంభతేదీని ప్రకటించారు.  10 జట్ల మెగా లీగ్‌ వచ్చే నెల 26న ముంబైలో ఆరంభం కానుండగా.. మే 29న ఫైనల్‌ మ్యాచ్‌ జరగనుంది. గురు వారం జరిగిన పాలకమండలి సమా వేశంలో టోర్నీ తేదీలు, వేదికలను ఖరారు చేసినట్టు ఐపీఎల్‌ చైర్మన్‌ బ్రిజేష్‌ పటేల్‌ తెలిపాడు. మొత్తం 74 మ్యాచ్‌ల్లో.. 70 లీగ్‌ మ్యాచ్‌లను ముంబైలోని వాంఖడే, బ్రబౌర్న్‌, డీవై పాటిల్‌, పుణెలోని గహుంజే స్టేడియాల్లో నిర్వహించ నున్నారు. ముంబైలో 55, పుణెలో 15 మ్యాచ్‌లు జరగనుం డగా.. మొత్తం 12 డబుల్‌ హెడర్‌ మ్యాచ్‌లను ఖరారు చేశారు. పూర్తి షెడ్యూల్‌ విడుదల చేసినప్పుడు వీటిపై స్పష్ట త రానుంది. కాగా, నాలుగు ప్లేఆఫ్స్‌ మ్యాచ్‌లకు సంబంధించిన వేదికలపై త్వరలో నిర్ణయం తీసుకోనున్నారు. అయితే, అహ్మదాబాద్‌లో నాకౌట్‌ మ్యాచ్‌లను నిర్వహించే అవకాశం ఉంది. లీగ్‌ ఆరంభదశలో 40 శాతం మంది ప్రేక్షకులను అనుమతించనుండగా.. కరోనా అదుపులోకి వస్తే పూర్తి స్థాయిలో గేట్లు ఎత్తేసే అవకాశం ఉంది. 

Updated Date - 2022-02-25T09:32:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising