ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆ క్రెడిట్‌ మరెవరో కొట్టేశారు !

ABN, First Publish Date - 2022-02-11T09:14:40+05:30

ఆ క్రెడిట్‌ మరెవరో కొట్టేశారు !

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆసీస్ పై టెస్ట్‌ సిరీస్‌ విజయంపై రహానె

రవిశాస్త్రిపై పరోక్ష చురకలు


న్యూఢిల్లీ : 2020-21..ఆస్ట్రేలియా టెస్ట్‌ సిరీస్‌లోని విపత్కర తరుణంలో సారథ్య బాధ్యతలు చేపట్టిన అజింక్యా రహానె జట్టును ఎంత అద్భుతంగా నడిపించాడో అందరికీ తెలిసిందే. రెండో టెస్ట్‌లో తాను సెంచరీ చేయడంతోపాటు జట్టుకు చారిత్రక విజయం అందించడంలో కీలక భూమిక పోషించాడు. ఆ ఊపులో మూడో  టెస్ట్‌ను డ్రా చేసుకున్న భారత్‌..నాలుగో టెస్ట్‌లో గెలిచి ఏకంగా సిరీస్‌ పట్టేసింది.  కానీ మెల్‌బోర్న్‌ టెస్ట్‌తోపాటు ఆ సిరీస్‌ విజయం ఖ్యాతి రహానెకు కాకుండా మరెవరికో దక్కింది. ‘బ్యాక్‌స్టేజ్‌ విత్‌ బోరియా’ అనే కార్యక్రమంలో ఆ విషయమై అజింక్యా కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘చారిత్రక టెస్ట్‌ సిరీస్‌ విజయం సాధించాం. రెండో టెస్ట్‌ మ్యాచ్‌లో నేను ఏం చేశానో నాకు తెలుసు. వాటిని చాటుకోవాల్సిన అవసరం లేదు. అయినా ఆ గెలుపు నా క్రెడిట్‌ అని గొప్పలు చెప్పుకొనే మనస్తత్వం నాదికాదు. కానీ మైదానంలో, డ్రెస్సింగ్‌ రూంలో నేను తీసుకున్న కొన్ని నిర్ణయాలున్నాయి. వాటి క్రెడిట్‌ తమదని మరొకరు చెప్పుకొన్నారు’ అని రహానె అన్నాడు. ఆ వ్యక్తి ఎవరనేది అజింక్యా వెల్లడించకున్నా..నాటి హెడ్‌ కోచ్‌ రవిశాస్త్రినుద్దేశించి పరోక్షంగా ఆ వ్యాఖ్యలు చేశాడు. 

Updated Date - 2022-02-11T09:14:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising