దక్షిణాఫ్రికా భారీ విజయం
ABN, First Publish Date - 2022-03-02T08:56:59+05:30
న్యూజిలాండ్‌తో రెండో టెస్ట్‌లో పర్యాటక దక్షిణాఫ్రికా 198 పరుగుల భారీ తేడాతో నెగ్గింది.
క్రైస్ట్‌చర్చ్: న్యూజిలాండ్‌తో రెండో టెస్ట్‌లో పర్యాటక దక్షిణాఫ్రికా 198 పరుగుల భారీ తేడాతో నెగ్గింది. రెండు టెస్ట్‌ల సిరీస్‌ను 1-1తో సమం చేసింది. అంతేకాకుండా కివీస్‌పై టెస్ట్ సిరీస్ ఓడని రికార్డును మెరుగుపరచుకొంది. 426 పరుగుల లక్ష్యఛేదనలో.. 94/4 స్కోరుతో ఆఖరి, ఐదో రోజు ఆటను కొనసాగించిన కివీస్ రెండో ఇన్నింగ్స్‌లో 227 పరుగులకు ఆలౌటైంది. ఓవర్‌నైట్ బ్యాటర్ కాన్వే (92) టాప్ స్కోరర్. రబాడ, జెన్సెన్, కేశవ్ మహరాజ్ మూడేసి వికెట్లు పడగొట్టారు. దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 364 పరుగులు చేయగా.. రెండో ఇన్నింగ్స్‌ను 354/9 వద్ద డిక్లేర్ చేసింది. న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 293 పరుగులకు ఆలౌటైంది.
Updated Date - 2022-03-02T08:56:59+05:30 IST