సౌరవ్.. అదిరెన్
ABN, First Publish Date - 2022-08-04T08:56:54+05:30
స్క్వాష్ పురుషుల సింగిల్స్‌లో సౌరవ్ ఘోషల్ కాంస్యం సాధించి చరిత్ర సృష్టించాడు...
పతక పోరు గెలిచాక సౌరవ్ ఉద్వేగం..
స్క్వాష్ పురుషుల సింగిల్స్‌లో సౌరవ్ ఘోషల్ కాంస్యం సాధించి చరిత్ర సృష్టించాడు. కాంస్యం పోరులో సౌరవ్ 3-0 (11-6, 11-1, 11-4)తో జేమ్స్ విల్‌స్ట్రాప్ (ఇంగ్లండ్)ను ఓడించాడు. దీంతో ఈ క్రీడల్లో స్క్వాష్ సింగిల్స్‌లో పతకం గెలిచిన తొలి భారత ప్లేయర్‌గా సౌరవ్ రికార్డులకెక్కాడు. స్క్వాష్ మిక్స్‌డ్ డబుల్స్‌లో జోష్న చిన్నప్ప-హరిందర్‌పాల్ సింగ్ సంధు జోడీ ప్రీక్వార్టర్స్‌కు దూసుకెళ్లింది. ఆరంభరౌండ్లో జోష్న జంట 8-11, 11-4, 11-3తో శ్రీలంక ద్వయాన్ని ఓడించింది. అంతకుముందు మహిళల సింగిల్స్ ప్లేట్ ఫైనల్లో సునయన 11-7, 13-11, 11-2తో ఫంగ్ (గయానా)పై గెలిచింది.
Updated Date - 2022-08-04T08:56:54+05:30 IST