ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సింధు, శ్రీకాంత్‌ ముందంజ

ABN, First Publish Date - 2022-05-19T10:26:24+05:30

ఫామ్‌లేమితో తంటాలు పడుతున్న సైనా నెహ్వాల్‌కు థాయ్‌లాండ్‌ ఓపెన్‌లోనూ నిరాశే ఎదురైంది. ఆమె అనూహ్యంగా ఆరంభ రౌండ్లోనే నిష్క్రమించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సైనా ఇంటిదారి

థాయ్‌లాండ్‌ ఓపెన్‌ 

బ్యాంకాక్‌: ఫామ్‌లేమితో తంటాలు పడుతున్న సైనా నెహ్వాల్‌కు థాయ్‌లాండ్‌ ఓపెన్‌లోనూ నిరాశే ఎదురైంది. ఆమె అనూహ్యంగా ఆరంభ రౌండ్లోనే నిష్క్రమించింది. ఇక,  కిడాంబి శ్రీకాంత్‌ శుభారంభం చేయగా.. పీవీ సింధు,  మాళవికా బన్సోడ్‌ ముందంజ వేశారు. బుధవారం జరిగిన తొలి రౌండ్లో సైనా 21-11, 15-21, 17-21తో కొరియా షట్లర్‌ కిమ్‌ గా ఎన్‌ చేతిలో ఓటమిపాలై ఇంటిబాట పట్టింది. ఇక, దాదాపు గంటపాటు సాగిన హోరాహోరీ పోరులో ఆరోసీడ్‌ సింధు 21-19, 19-21, 21-18తో లారెన్‌ లామ్‌ (అమెరికా)పై గెలిచింది. మిగతా భారత మహిళల్లో  మాళవికా బన్సోడ్‌ 17-21, 21-13, 21-11తో ఉక్రెయిన్‌కు చెందిన మరియా ఉలిటినాపై నెగ్గి రెండోరౌండ్‌ చేరగా, అస్మితా చాలిహా 10-21, 15-21తో ఏడోసీడ్‌ రచనోక్‌ (థాయ్‌లాండ్‌) చేతిలో, ఆకర్షి కశ్యప్‌ 13-21, 18-21తో మిచెల్లె లీ (కెనడా) చేతిలో ఓడారు. ఇక 8వ సీడ్‌ శ్రీకాంత్‌ 18-21, 21-10, 21-16తో బ్రైస్‌ లెవర్జ్‌ (ఫ్రాన్స్‌)ను ఓడించి రెండోరౌండ్లో అడుగుపెట్టాడు. సాయి ప్రణీత్‌ 12-21, 13-21తో కంటపాన్‌ (థాయ్‌లాండ్‌) చేతిలో, సౌరభ్‌ వర్మ 20-22, 12-21తో టోమా జూనియర్‌ పొపోవ్‌ (ఫ్రాన్స్‌) చేతిలో, హెచ్‌ఎస్‌ ప్రణయ్‌ 17-21, 21-15, 15-21తో డారెన్‌ లీ (మలేసియా) చేతిలో ఓడి ఇంటిబాట పట్టారు. 

Updated Date - 2022-05-19T10:26:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising