ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

క్వార్టర్స్‌లో సింధు

ABN, First Publish Date - 2022-05-20T10:12:41+05:30

రెండుసార్లు ఒలింపిక్‌ పతక విజేత పీవీ సింధు థాయ్‌లాండ్‌ ఓపెన్‌లో క్వార్టర్‌ఫైనల్‌కు దూసుకుపోయింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వైదొలగిన శ్రీకాంత్‌

థాయ్‌లాండ్‌ ఓపెన్‌

బ్యాంకాక్‌: రెండుసార్లు ఒలింపిక్‌ పతక విజేత పీవీ సింధు థాయ్‌లాండ్‌ ఓపెన్‌లో క్వార్టర్‌ఫైనల్‌కు దూసుకుపోయింది. అయితే పురుషుల సింగిల్స్‌లో..స్టార్‌ షట్లర్‌ కిడాంబి శ్రీకాంత్‌ రెండోరౌండ్‌నుంచి అనూహ్యంగా వైదొలిగాడు. ఫలితంగా ఈ టోర్నమెంట్‌లో భారత్‌ తరపున సింధు మాత్రమే మిగిలింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్‌ రెండో రౌండ్‌లో ప్రపంచ ఏడో ర్యాంకర్‌ సింధు 21-16, 21-13తో సిమ్‌ యు జిన్‌ (కొరియా)పై సునాయాసంగా నెగ్గింది. తదుపరి రౌండ్‌లో రెండో సీడ్‌ అకానె యమగూచితో సింధు అమీతుమీ తేల్చుకోనుంది.


భారత జట్టు థామస్‌ కప్‌ స్వర్ణం సాధించడంలో కీలక భూమిక పోషించిన శ్రీకాంత్‌..ఎంగ్యుయెన్‌ (ఐర్లాండ్‌)తో రెండో రౌండ్‌లో తలపడాల్సి ఉంది. కానీ ఎనిమిదో సీడ్‌ కిడాంబి..ప్రత్యర్థికి వాకోవర్‌ ఇచ్చాడు. అయితే టోర్నీ నుంచి తప్పుకోవడానికి గల కారణాలను మాత్రం శ్రీకాంత్‌ వెల్లడించలేదు. మహిళల సింగిల్స్‌ రెండో రౌండ్‌లో మాళవికా బన్సోడ్‌ 21-16, 14-21, 14-21తో లినె క్రిస్టోఫర్‌సన్‌ (డెన్మార్క్‌) చేతిలో పోరాడి ఓడింది. హోరాహోరీగా జరిగిన మిక్స్‌డ్‌ రెండో రౌండ్‌లో ఇషాన్‌ భట్నాగర్‌, తనీషా క్రాస్టో ద్వయం 19-21, 20-22తో ఆరో సీడ్‌ మలేసియా జోడీ గో హౌట్‌, షెవాన్‌ చేతిలో పరాజయం చవిచూసింది. 

Updated Date - 2022-05-20T10:12:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising