ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శ్రీలంకకు షాక్‌

ABN, First Publish Date - 2022-10-17T09:48:54+05:30

గత వరల్డ్‌ కప్‌ సూపర్‌-12లో స్కాట్లాండ్‌పై సంచలన విజయంతో అందరి దృష్టి ఆకర్షించిన నమీబియా ఈసారి అంతకుమించి రాణించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నమీబియా సంచలనం

బ్యాటర్లు, బౌలర్లు అదుర్స్‌ 

జీలాంగ్‌: గత వరల్డ్‌ కప్‌ సూపర్‌-12లో స్కాట్లాండ్‌పై సంచలన విజయంతో అందరి దృష్టి ఆకర్షించిన నమీబియా ఈసారి అంతకుమించి రాణించింది. గ్రూప్‌ ‘ఎ’తొలిపోరులో శ్రీలంక జట్టుపై విజయంతో మెగా టోర్నీకి అదిరిపోయే కిక్‌ ఇచ్చింది. టాస్‌ కోల్పోయి మొదట బ్యాటింగ్‌ చేసిన నమీబియా 20 ఓవర్లలో 163/7 స్కోరు చేసింది. జాన్‌ ఫ్రైలింక్‌ (28 బంతుల్లో 4 ఫోర్లతో 44), జేజే స్మిట్‌ (16 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 31 నాటౌట్‌) బ్యాట్లు ఝళిపించారు. మదుషాన్‌ రెండు వికెట్లు పడగొట్టాడు. ఛేదనలో శ్రీలంక 19 ఓవర్లలో 108 పరుగులకే కుప్పకూలింది. కెప్టెన్‌ షనక (29), రాజపక్ష (20) మాత్రమే పర్లేదనిపించారు. వీజ్‌, స్కోల్జ్‌, షికాంగో, ఫ్రిలింక్‌ తలా రెండు వికెట్లు తీశారు. ఫ్రిలింక్‌ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా నిలిచాడు.


వికెట్లు టపటపా..: 

ఇటీవలి ఆసియా కప్‌ను లంకేయులు సొంతం చేసుకోవడంలో ఆ జట్టు ఓపెనర్లు నిస్సాంక, కుశాల్‌ మెండి్‌సది కీలక పాత్ర. కానీ ఈమ్యాచ్‌లో వారు సింగిల్‌ డిజిట్‌ కే పరిమితమయ్యారు. కుశాల్‌ (6)ను అవుట్‌ చేసిన వీజ్‌..ప్రత్యర్థి పతనానికి శ్రీకారం చట్టుగా నిస్సాంక (9), గుణతిలక (0) వరుస బంతుల్లో షికాంగో పెవిలియన్‌ చేర్చడంతో 21/3తో శ్రీలంక విలవిలలాడింది. మిడిలార్డర్‌ కూడా కుప్పకూలినా రాజపక్ష, షనక కొద్దిసేపు నమీబియా బౌలర్లను అడ్డుకోవడంతో లంక స్కోరు వంద దాటింది. 10 నుంచి 17 ఓవర్ల మధ్య శ్రీలంక ఐదు వికెట్లు చేజార్చుకొని కేవలం 25 పరుగులే చేసింది. 


స్మిట్‌, జాన్‌ ధనాధన్‌..:

మొదట..నమీబియా ఇన్నింగ్స్‌ కూడా సాఫీగా సాగలేదు. 15 ఓవర్లు ముగిసే సరికి ఆ జట్టు 93/6తో దయనీయంగానే కనిపించింది. కానీ  ఫ్రైలింక్‌, స్మిట్‌ ఒక్కసారి చెలరేగారు. 34 బంతుల్లోనే ఏడో వికెట్‌కు 70 పరుగులు జోడించారు. దాంతో నమీబియా స్కోరు 160 పరుగులకుపైగా దాటింది. 


సంక్షిప్తస్కోర్లు

నమీబియా:

20 ఓవర్లలో 163/7 (ఫ్రైలింక్‌ 44, స్మిట్‌ నాటౌట్‌ 31, బార్డ్‌ 26, మదుషాన్‌ 2/37)

శ్రీలంక:

19 ఓవర్లలో 108 (షనక 29, రాజపక్ష 20, వీజ్‌ 2/16, స్కోల్జ్‌ 2/18, షికాంగో 2/22, ఫ్రైలింక్‌ 2/26). 

Updated Date - 2022-10-17T09:48:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising