ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చరిత్ర సృష్టించిన శిఖర్ ధవన్.. ఆ ఘనత సాధించిన తొలి ఇండియన్‌గా రికార్డు

ABN, First Publish Date - 2022-04-09T22:35:59+05:30

పంజాబ్ కింగ్స్ ఆటగాడు శిఖర్ ధవన్ అత్యంత అరుదైన రికార్డు సాధించాడు. టీ20ల్లో 1000 బౌండరీలు సాధించిన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై: పంజాబ్ కింగ్స్ ఆటగాడు శిఖర్ ధవన్ అత్యంత అరుదైన రికార్డు సాధించాడు. టీ20ల్లో 1000 బౌండరీలు సాధించిన తొలి భారత ఆటగాడిగా రికార్డులకెక్కాడు. అలాగే, ఓవరాల్‌గా ఆ ఘనత సాధించిన ఐదో క్రికెట్‌గా చరిత్ర సృష్టించాడు. గుజరాత్ టైటాన్స్‌తో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో 4 బౌండరీలు సాధించిన ధవన్ మొత్తం బౌండరీల సంఖ్యను వెయ్యి దాటించాడు. ధవన్ 307వ మ్యాచ్‌లో ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌కు ముందు ధవన్ ఖాతాలో 997 బౌండరీలు ఉన్నాయి.   


ధవన్ తర్వాతి స్థానంలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, సురేశ్ రైనా ఉన్నారు. వీరు ముగ్గురు వరుసగా 917, 875, 779 బౌండరీలు బాదారు. ఇక, అంతర్జాతీయంగా చూస్తే క్రిస్ గేల్ 463 మ్యాచుల్లో 1132 ఫోర్లతో 14,562 పరుగులు సాధించగా,  అలెక్స్ హేల్స్ 336 మ్యాచుల్లో 1054 ఫోర్లతో 9,471 పరుగులు, డేవిడ్ వార్నర్ 314 మ్యాచుల్లో 1005 పోర్లతో 10,312 పరుగులు, అరోన్ ఫించ్ 348 మ్యాచుల్లో 1004 పోర్లతో 10,499 బౌండీలు సాధించారు. తాగా, శిఖర్ ధవన్ 307 మ్యాచుల్లో 1000 బౌండరీలతో 8867 పరుగులతో ఉన్నాడు. 

Updated Date - 2022-04-09T22:35:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising