ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విండీస్‌ టూర్‌కు వన్డే కెప్టెన్‌గా ధవన్‌

ABN, First Publish Date - 2022-07-07T08:21:10+05:30

వెస్టిండీస్‌తో ఈనెల 22 నుంచి జరిగే మూడు వన్డేల సిరీస్‌కు భారత జట్టు సారథిగా శిఖర్‌ ధవన్‌ వ్యవహరించనున్నాడు. ఈ మేరకు వెస్టిండీస్‌ వెళ్లనున్న 16 మంది

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రోహిత్‌, కోహ్లీ, పంత్‌, బుమ్రాకు విశ్రాంతి 


న్యూఢిల్లీ: వెస్టిండీస్‌తో ఈనెల 22 నుంచి జరిగే మూడు వన్డేల సిరీస్‌కు భారత జట్టు సారథిగా శిఖర్‌ ధవన్‌ వ్యవహరించనున్నాడు. ఈ మేరకు వెస్టిండీస్‌ వెళ్లనున్న 16 మంది సభ్యుల బృందాన్ని బుధవారం ఎంపిక చేశారు. రెగ్యులర్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మతోపాటు విరాట్‌ కోహ్లీ, రిషభ్‌ పంత్‌, హార్దిక్‌ పాండ్యా, బుమ్రా, షమిలకు విశ్రాంతి నిచ్చారు. ఆల్‌రౌండర్‌ జడేజాను వైస్‌ కెప్టెన్‌గా ఎంపిక చేయగా.. 2020 ఆస్ట్రేలియా పర్యటన తర్వాత శుభ్‌మన్‌ గిల్‌కు వన్డే జట్టులో చోటు దక్కింది. ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌లో అవకాశం లభించని దీపక్‌ హుడా, సంజూ శాంసన్‌, రుతురాజ్‌ గైక్వాడ్‌, అవేశ్‌ ఖాన్‌లు విండీస్‌తో సిరీస్‌కు మళ్లీ టీమ్‌లోకి వచ్చారు.


టీ20 వరల్డ్‌కప్‌ ముందు ఆడే ఒకే ఒక్క వన్డే సిరీస్‌ కావడం తో సీనియర్లను దూరంగా ఉంచినట్టు సమాచారం. అయితే, ఈనెల 29 నుంచి విండీస్‌తో జరిగే ఐదు టీ20ల సిరీస్‌కు మాత్రం ఇంకా జట్టును ఎంపిక చేయలేదు. పొట్టి వరల్డ్‌ కప్‌ను దృష్టిలో ఉంచుకొని సీనియర్లు మళ్లీ టీమ్‌లోకి వచ్చే అవకాశం ఉంది. పోర్ట్‌ ఆఫ్‌ స్పెయిన్‌ వేదికగా ఈనెల 22న తొలి వన్డే, 24న రెండో వన్డే, 27న మూడో వన్డేను షెడ్యూల్‌ చేశారు. ఆ తర్వాత టీ-20 మ్యాచ్‌లు జరుగుతాయి.


భారత జట్టు

శిఖర్‌ ధవన్‌ (కెప్టెన్‌), జడేజా, రుతురాజ్‌, గిల్‌, దీపక్‌ హుడా, సూర్యకుమార్‌ యాదవ్‌, శ్రేయాస్‌ అయ్యర్‌, ఇషాన్‌ కిషన్‌, సంజూ శాంసన్‌, శార్దూల్‌ ఠాకూర్‌, చాహ ల్‌, అక్షర్‌ పటేల్‌, అవేశ్‌ ఖాన్‌, ప్రసిద్ధ్‌ కృష్ణ, సిరాజ్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌. 

Updated Date - 2022-07-07T08:21:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising