ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

షరపోవా, షుమాకర్‌పై మోసం, కుట్ర కేసు

ABN, First Publish Date - 2022-03-18T09:07:19+05:30

మోసం, కుట్ర కేసులో మాజీ టెన్నిస్‌ స్టార్‌ మరియా షరపోవా, మాజీ ఎఫ్‌-1 రేసర్‌ మైకేల్‌ షుమాకర్‌ సహా 11 మందిపై గురుగావ్‌ పోలీసులు కేసు నమోదు చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: మోసం, కుట్ర కేసులో మాజీ టెన్నిస్‌ స్టార్‌ మరియా షరపోవా, మాజీ ఎఫ్‌-1 రేసర్‌ మైకేల్‌ షుమాకర్‌ సహా 11 మందిపై గురుగావ్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. షరపోవా, షుమాకర్‌ ప్రమోటర్లుగా ఉన్న ఓ రియల్‌ ఎస్టేట్‌ ప్రాజెక్ట్‌లో తాను ఫ్లాట్‌ బుక్‌ చేసి మోసపోయానని ఢిల్లీకి చెందిన మహిళ షఫాలీ అగర్వాల్‌ ఫిర్యాదు చేసింది. 2016 కల్లా తనకు ఫ్లాట్‌ అప్పజెబుతామని బిల్డర్‌ చెప్పినా.. అది ఇంత వరకు మొదలేకాదని అగర్వాల్‌ పేర్కొంది. తనను రూ. 80 లక్షలదాకా మోసం చేశారని.. బిల్డర్‌ రియల్‌టెక్‌ డెవల్‌పమెంట్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కంపెనీ, షరపోవా, షుమాకర్‌లపై షఫాలీ కోర్టులో కేసు వేసింది. విచారించిన కోర్టు... కంపెనీ, సెలెబ్రిటీలపై కేసులు నమోదు చేయాని ఆదేశించడంతో.. పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ తెరిచారు. కాగా 2013 డిసెంబరులో జరిగిన స్కీయింగ్‌ యాక్సిడెంట్‌లో గాయపడిన షుమాకర్‌ ఇప్పటికీ కోలుకోలేదు.

Updated Date - 2022-03-18T09:07:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising