ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హార్మనీతో సెరెనా పోరు

ABN, First Publish Date - 2022-06-25T10:21:45+05:30

మరో రెండురోజుల్లో మొదలవనున్న వింబుల్డన్‌ టోర్నమెంట్‌ కోసం ఆటగాళ్ల డ్రాను శుక్రవారం విడుదల చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వింబుల్డన్‌ డ్రా విడుదల

వింబుల్డన్‌: మరో రెండురోజుల్లో మొదలవనున్న వింబుల్డన్‌ టోర్నమెంట్‌ కోసం ఆటగాళ్ల డ్రాను శుక్రవారం విడుదల చేశారు. డ్రా ప్రకారం మహిళల సింగిల్స్‌లో ఏడుసార్లు విజేత సెరెనా ఆరంభరౌండ్లో ఫ్రాన్స్‌కు చెందిన 113వ ర్యాంకర్‌ హార్మనీ టాన్‌తో తలపడనుంది. గాయం కారణంగా ఇన్నాళ్లు ఆటకు దూరమైన సెరెనా.. సరిగ్గా ఏడాది తర్వాత ఆడుతున్న తొలి టోర్నీ ఇదే. ప్రస్తుతం 1204వ ర్యాంక్‌కు పడిపోయిన సెరెనా వైల్డ్‌కార్డ్‌ ఎంట్రీతో అన్‌సీడెడ్‌గా టోర్నీ బరిలోకి దిగుతోంది.


రెండోరౌండ్లో 32వ సీడ్‌ సారా సోరిబెస్‌ టోర్మోను ఎదుర్కోనున్న సెరెనాకు మూడోరౌండ్లో మాత్రం ఆరోసీడ్‌ ప్లిస్కోవా రూపంలో కఠిన ప్రత్యర్థి ఎదురుకానుంది. ఏదేమైనా 24వ గ్రాండ్‌స్లామ్‌ కోసం ఐదేళ్లుగా ఎదురుచూస్తున్న సెరెనాకు తన లక్ష్యం చేరడం అంత సులువేమీ కాకపోవచ్చు. మహిళల టాప్‌సీడ్‌, ఇటీవల ఫ్రెంచ్‌ ఓపెన్‌ నెగ్గి జోరుమీదున్న స్వియటెక్‌ క్వాలిఫయర్‌ జానా నెట్‌తో తన పోరు ప్రారంభించనుంది. పురుషుల సింగిల్స్‌లో వోన్‌ సూన్‌ వోతో డిఫెండింగ్‌ చాంప్‌ జొకోవిచ్‌, ఫ్రాన్సిస్కోతో రెండోసీడ్‌ నడాల్‌ మొదటిరౌండ్‌ ఆడనున్నారు. 

Updated Date - 2022-06-25T10:21:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising