ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ముగిసిన రెండో రోజు ఆట.. కష్టాల్లో శ్రీలంక

ABN, First Publish Date - 2022-03-05T23:10:57+05:30

భారత్-శ్రీలంక మధ్య ఇక్కడ జరుగుతున్న తొలి టెస్టు రెండో రోజు ఆట ముగిసింది. 574/8 పరుగుల వద్ద

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మొహాలీ: భారత్-శ్రీలంక మధ్య ఇక్కడ జరుగుతున్న తొలి టెస్టు రెండో రోజు ఆట ముగిసింది. 574/8 పరుగుల వద్ద భారత జట్టు తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిన తర్వాత బ్యాటింగ్ ప్రారంభించిన శ్రీలంక ఆట ముగిసే సమయానికి తన తొలి ఇన్నింగ్స్‌లో 4 వికెట్ల నష్టానికి 108 పరుగులు చేసింది. బ్యాటింగ్‌లో సత్తాచాటిన టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ రెండు వికెట్లు తీసి శ్రీలంకను దెబ్బకొట్టగా, బుమ్రా, జడేజా చెరో వికెట్ తీసుకున్నారు. 


శ్రీలంక కెప్టెన్ దిముత్ కరుణరత్నె 28, లహిరు తిరుమన్నె 17, ఏంజెలో మ్యాథ్యూస్ 22, ధనంజయ డి సిల్వా ఒక పరుగు మాత్రమే చేసి పెవిలియన్ చేరారు. దీంతో 103 పరుగులకే నాలుగు కీలక వికెట్లు కోల్పోయిన లంక కష్టాల్లో పడింది. ప్రస్తుతం పాతుమ్ నిశ్శంక (26), చరిత్ అసలంక (1) క్రీజులో ఉన్నారు. 


అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 357/6తో రెండో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన భారత జట్టు 574/8 వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. రవిచంద్రన్ అశ్విన్ 61 పరుగులు చేసి అవుట్ కాగా, షమీ 20 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. మ్యాచ్ తొలి రోజు పంత్ 96 పరుగులు చేసి నాలుగు పరుగుల తేడాతో సెంచరీ చేజార్జుకున్నాడు. హనుమ విహారి 58 పరుగులు చేయగా, కోహ్లీ 45 పరుగులు చేసి అవుటయ్యాడు. 

Updated Date - 2022-03-05T23:10:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising