ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Umran Malik పై గంగూలీ ప్రశంసల జల్లు !

ABN, First Publish Date - 2022-05-27T03:53:03+05:30

ఐపీఎల్‌(IPL)లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ బౌలర్(Sunrisers Hyderabad) ఉమ్రాన్‌ మాలిక్‌(Umran malik) సత్తా చాటాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై : ఐపీఎల్‌(IPL)లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ బౌలర్(Sunrisers Hyderabad) ఉమ్రాన్‌ మాలిక్‌(Umran malik) సత్తా చాటాడు. గంటకు గరిష్ఠంగా 157 కిలోమీటర్ల వేగంతో బంతులు విసిరి ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌కు చెమటలు పట్టించాడు. అంతటి వేగంలోనూ లయ తప్పకుండా బంతులు విసరడాన్ని మాజీ దిగ్గజ క్రికెటర్లు ప్రశంసించారు. తాజాగా ఉమ్రాన్‌ మాలిక్‌పై బీసీసీఐ ప్రెసిడెంట్‌ సౌరభ్ గంగూలీ కూడా పొగడ్తల వర్షం కురిపించాడు. ఉమ్రాన్‌ మాలిక్ ఫిట్‌గా ఉంటే సుదీర్ఘకాలంపాటు టీమిండియాకు ఆడతాడని ఆశాభావం వ్యక్తంచేశాడు. ఉమ్రాన్‌ మాలిక్ భవిష్యత్‌ అతడి చేతుల్లోనే ఆధారపడి ఉందని తెలిపాడు.


ఇదే ఫిట్‌నెస్‌ సుధీర్ఘకాలంపాటు కొనసాగిస్తే.. టీమిండియాకు ఆడతాడనే నమ్మకం తనకుందని మనసులో మాట బయటపెట్టాడు. అలాగే మరికొందరు ఆటగాళ్లపై కూడా సౌరభ్‌గంగూలీ ప్రశంసలు కురిపించాడు. తిలక్ వర్మ, రాహుల్‌ త్రిపాఠి, రాహుల్‌ తెవాతియా కూడా చాలా బాగా రాణిస్తున్నారని కితాబిచ్చారు. ఇక జూన్‌ 9 నుంచి భారత్, సౌతాఫ్రికా మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ ప్రారంభం కానుంది. తుదిజట్టును బీసీసీఐ ప్రకటించింది. ఈ సిరీస్‌కు సీనియర్లు ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలకు విశ్రాంతినిచ్చారు. కేఎల్ రాహుల్ కెప్టెన్‌గా, రిషభ్ పంత్ వైస్‌ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు. ఈ జట్టులో ఉమ్రాన్‌ మాలిక్‌ చోటు దక్కించుకున్నాడు.

Updated Date - 2022-05-27T03:53:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising