ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Sandeep Lamichhane: 17 ఏళ్ల బాలికపై ఐపీఎల్ క్రికెటర్ అత్యాచారం.. అరెస్ట్ కోసం ఇంటర్‌పోల్ సాయం కోరిన నేపాల్

ABN, First Publish Date - 2022-09-28T01:34:27+05:30

నేపాల్ స్టార్ క్రికెటర్ సందీప్ లమిచ్చనే(Sandeep Lamichhane) కష్టాల్లో చిక్కుకున్నాడు. 17 ఏళ్ల బాలికను అత్యాచారం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కఠ్మాండు: నేపాల్ స్టార్ క్రికెటర్ సందీప్ లమిచ్చనే(Sandeep Lamichhane) కష్టాల్లో చిక్కుకున్నాడు. 17 ఏళ్ల బాలికను అత్యాచారం చేశాడన్న ఆరోపణలపై అతడిపై అరెస్ట్ వారెంట్ జారీ అయింది. నేపాల్ జట్టు స్కిప్పర్ కూడా అయిన సందీప్‌(Sandeep Lamichhane)ను సస్పెండ్ చేస్తూ నేపాల్ క్రికెట్ బోర్డు నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం పరారీలో ఉన్న నేరస్ధుడి జాబితాలో ఉన్న సందీప్‌(Sandeep Lamichhane)ను పట్టుకునేందుకు నేపాల్ ప్రభుత్వం ఇంటర్‌పోల్ సాయం కోరింది. స్పందించిన ఇంటర్‌పోల్.. సందీప్(Sandeep Lamichhane) సమాచారం చెప్పాలంటూ సభ్య దేశాలకు నోటీసులు జారీ చేసింది.


నేపాల్ పోలీసులు తనపై అరెస్ట్ వారెంట్ జారీ చేసిన రెండు వారాల తర్వాత సందీప్(Sandeep Lamichhane) స్పందించాడు. ప్రస్తుతం అతడు కరీబియన్ దీవుల్లో సీపీఎల్ పోటీల్లో ఆడుతున్నట్టు తెలుస్తోంది. తాను ఏ పాపం ఎరుగనని పేర్కొన్న సందీప్(Sandeep Lamichhane) త్వరలోనే నేపాల్ వస్తానని, తనపై వచ్చిన ఆరోపణలు నిజం కాదనని నిరూపిస్తానని అన్నాడు. ఈ ఆరోపణలు తనపై మానసికంగా, శారీరకంగా తీవ్ర ప్రభావం చూపించాయని ఆవేదన వ్యక్తం చేశాడు. అయితే, తాను ఎక్కడ ఉన్నానన్న విషయాన్ని మాత్రం బయటపెట్టలేదు. 22 ఏళ్ల ఈ లెగ్‌స్పిన్నర్ ఐపీఎల్ అభిమానులకు సుపరిచతమే. 2018 నుంచి 2020 మధ్య ఢిల్లీ కేపిటల్స్‌కు ఆడాడు. బిగ్‌బాస్, సీపీఎల్ వంటి విదేశీ లీగుల్లోనూ ఆడుతుంటాడు. 


ఇంతకీ కేసేంటంటే..

సందీప్ లమిచ్చనే(Sandeep Lamichhane) తనపై కఠ్మాండులోని ఓ హోటల్‌లో అత్యాచారం చేశాడని ఆరోపిస్తూ 17 ఏళ్ల బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. లమిచ్చనే(Sandeep Lamichhane)పై కేసు నమోదైన విషయాన్ని కఠ్మాండు పోలీసులు నిర్ధారించారు. తాను సందీప్ అభిమానని, వాట్సాప్, స్నాప్‌చాట్ వంటి వాటి ద్వారా తాము మాట్లాడుకుంటూ ఉంటామని పేర్కొంది. అయితే, ఆమె ఆరోపణలను లమిచ్చనే ఖండించాడు. ఈ తప్పుడు ఆరోపణలపై తాను చట్టపరంగా పోరాడతానని ఫేస్‌బుక్ పోస్టు ద్వారా పేర్కొన్నాడు. నేపాల్ చట్టం ప్రకారం నేరం రుజువయ్యే వరకు తాను నిర్దోషినన్న విషయం తనకు తెలుసని అన్నాడు. గౌరవంగా జీవించే హక్కు, గోప్యత హక్కు, ఆరోగ్య హక్కును రాజ్యాంగం ఇచ్చిందని, తాను తన న్యాయవాదిని సంప్రదించే హక్కును కూడా ప్రసాదించిందని కూడా తాను అర్థం చేసుకున్నట్టు చెప్పాడు. 


గొప్ప రికార్డులు

నేపాల్ స్టార్ క్రికెటర్‌గా వెలుగొందుతున్న సందీప్(Sandeep Lamichhane) పేరుపై పలు రికార్డులు ఉన్నాయి. ప్రపంచంలోని లీగులన్నింటిలోనూ ఆడిన ఏకైక ఆటగాడిగా గొప్ప రికార్డును సొంతం చేసుకున్నాడు. ఇందులో ఐపీఎల్, బిగ్ బాష్ లీగ్, పాకిస్థాన్ సూపర్ లీగ్, బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్, లంక ప్రీమియర్ లీగ్, సీపీఎల్ వంటివి ఉన్నాయి. అంతేకాదు, వన్డేల్లో అత్యంత వేగంగా 50 వికెట్లు తీసుకున్న రెండో బౌలర్‌గా, టీ20ల్లో అత్యంత వేగంగా 50 వికెట్లు పడగొట్టిన మూడో బౌలర్‌గా రికార్డులకెక్కాడు. ఈ ఏడాది ఆగస్టులో కెన్యాతో చివరిసారి టీ20 సిరీస్‌లో ఆడాడు. ఆ తర్వాత అతడు సీపీఎల్‌లో జమైకా తల్లావాస్‌కు ఆడాల్సి ఉన్నప్పటికీ మైదానంలో కనిపించలేదు. సందీప్‌(Sandeep Lamichhane)పై విచారణ పూర్తయ్యే వరకు అతడిపై సస్పెన్షన్ కొనసాగుతుందని నేపాల్ క్రికెట్ అసోసియేషన్ తెలిపింది.


Updated Date - 2022-09-28T01:34:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising