ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డకౌట్‌ అయ్యానని చెంపపై కొట్టాడు

ABN, First Publish Date - 2022-08-14T08:55:38+05:30

న్యూజిలాండ్‌ మాజీ బ్యాటర్‌ రాస్‌ టేలర్‌ తన ఆత్మకథ ‘బ్లాక్‌ అండ్‌ వైట్‌’లో సంచలన విషయాలను రాసుకొచ్చాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వెల్లింగ్టన్‌: న్యూజిలాండ్‌ మాజీ బ్యాటర్‌ రాస్‌ టేలర్‌ తన ఆత్మకథ ‘బ్లాక్‌ అండ్‌ వైట్‌’లో సంచలన విషయాలను రాసుకొచ్చాడు. ఇటీవలే సహచర ఆటగాళ్ల నుంచిఎదుర్కొన్న జాతి వివక్ష గురించి వెల్లడించిన అతడు తాజాగా ఐపీఎల్‌లో చవిచూసిన అవమానాన్ని బహిర్గతం చేశాడు. రాజస్థాన్‌ రాయల్స్‌ ఫ్రాంచైజీ యజమాని తనను చెంపదెబ్బ కొట్టాడని ఆరోపించాడు. ‘మొహాలీలో పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో మా జట్టు 195 రన్స్‌ను చేధించలేకపోయింది. ఆ మ్యాచ్‌లో నేను డకౌటయ్యాను. మ్యాచ్‌ ముగిశాక ఆటగాళ్లు, సహాయక సిబ్బంది, టీమ్‌ మేనేజ్‌మెంట్‌ కలిసి హోటల్‌ టాప్‌ ఫ్లోర్‌లో ఉన్న బార్‌లో కూర్చున్నాం.


అక్కడ షేన్‌ వార్న్‌, అతడి గాళ్‌ఫ్రెండ్‌ లిజ్‌ హర్లీ కూడా ఉంది. ఇంతలో అక్కడికి జట్టు యజమానులలో ఒకరు వచ్చి.. రాస్‌ మేం నీకు మిలియన్‌ డాలర్లు చెల్లిస్తోంది డకౌట్‌ కావడానికి కాదు.. అని నవ్వుతూనే నా ముఖంపై మూడు, నాలుగు సార్లు కొట్టాడు. అవి గట్టిగా కాకపోయినా, సరదాగా కొట్టినట్టు మాత్రం నాకనిపించలేదు. నిజానికి క్రీడల్లో ఇలాంటి పరిస్థితి వస్తుందని ఊహించలేదు’ అని టేలర్‌ తెలిపాడు. 2008-2010 మధ్య టేలర్‌ ఐపీఎల్‌లో బెంగళూరుకు ఆడగా 2011లో రాజస్థాన్‌కు మారాడు.

Updated Date - 2022-08-14T08:55:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising