ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

India vs West Indies: తొలి వన్డేలో ఇన్నింగ్స్‌ను ప్రారంభించేదెవరో చెప్పిన రోహిత్ శర్మ

ABN, First Publish Date - 2022-02-06T00:47:05+05:30

వెస్టిండీస్‌తో రేపు (ఆదివారం) జరగనున్న తొలి వన్డేలో భారత బ్యాటింగ్‌ను ప్రారంభించేది ఎవరన్న దానిపై స్పష్టత

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అహ్మదాబాద్: వెస్టిండీస్‌తో రేపు (ఆదివారం) జరగనున్న తొలి వన్డేలో భారత బ్యాటింగ్‌ను ప్రారంభించేది ఎవరన్న దానిపై స్పష్టత వచ్చేసింది. తనతో కలిసి ఇషాన్ కిషన్ ఇన్నింగ్స్‌ను ప్రారంభిస్తాడని కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. తొలి వన్డేకు దూరమైన కేఎల్ రాహుల్ రెండో వన్డేకు అందుబాటులో ఉంటాడు. శిఖర్ ధవన్, రుతురాజ్ గైక్వాడ్ కరోనా బారినపడడంతో ప్రస్తుతం అహ్మదాబాద్‌లో ఐసోలేషన్‌లో ఉన్నారు.


రీప్లేస్‌మెంట్ ఆటగాడైన మయాంక్ అగర్వాల్ ఇంకా క్వారంటైన్‌లో ఉండడంతో ఇన్నింగ్స్‌ను ప్రారంభించే అవకాశం ఇషాన్ కిషన్‌కు దక్కింది. మయాంక్ అగర్వాల్ ఇంకా క్వారంటైన్‌లోనే ఉన్నాడని,  కాబట్టి మిగిలిన ఒక్క ఆప్షన్ ఇషన్ కిషన్ అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.


శ్రేయాస్ అయ్యర్, శిఖర్ ధవన్, రుతురాజ్ గైక్వాడ్, నవదీప్ సైనీ (స్టాండ్ బై) సహా భారత శిబిరంలోని ఏడుగురు కరోనా బారినపడ్డారు. దీంతో బీసీసీఐ బుధవారం మయాంక్ అగర్వాల్‌ను జట్టులోకి తీసుకుంది. ఇలాంటి అనుకోని పరిస్థితుల వల్ల జట్టులో సమతౌల్యత దెబ్బ తింటుందని రోహిత్ అన్నాడు. ప్రస్తుతం మన ఎలాంటి పరిస్థితుల్లో నివసిస్తున్నామో అర్థం చేసుకోవాలని జట్టులోని కుర్రాళ్లను కోరాడు. ఎప్పుడు అవకాశం వస్తుందో తెలియని, కాబట్టి అందుకు సిద్ధంగా ఉండాలని రోహిత్ సూచించాడు.

Updated Date - 2022-02-06T00:47:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising