ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Rohit Sharma: అదంతా నాన్సెన్స్.. మరో ఫార్మాట్ వస్తుందని అనుకుంటున్నా: రోహిత్ శర్మ

ABN, First Publish Date - 2022-08-18T23:45:37+05:30

ప్రపంచవ్యాప్తంగా ఫ్రాంచైజీ క్రికెట్‌కు పెరుగుతున్న విపరీత ఆదరణ కారణంగా సంప్రదాయ క్రికెట్‌కు పతనావస్థకు చేరుకుంటోందన్న

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై: ప్రపంచవ్యాప్తంగా ఫ్రాంచైజీ క్రికెట్‌కు పెరుగుతున్న విపరీత ఆదరణ కారణంగా సంప్రదాయ క్రికెట్‌కు పతనావస్థకు చేరుకుంటోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. టీ20లతో షెడ్యూల మొత్తం నిండిపోవడంతో ప్రస్తుత క్రికెటర్లు అటు లీగ్ క్రికెట్‌ను వదులుకోలేక, ఇటు జాతీయ జట్టును వదులుకోలేక ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి పరిస్థితితో ఇరకాటంలో పడిన ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ బెన్‌స్టోక్స్ ఒత్తిడికి తలొగ్గి వన్డే క్రికెట్‌కు గుడ్‌బై చెప్పేశాడు. అయితే, టెస్టులు, టీ20లకు మాత్రం అందుబాటులో ఉంటానని చెప్పుకొచ్చాడు. కివీస్ స్పీడ్‌స్టర్ ట్రెంట్ బౌల్ట్ కూడా ఇటీవల ఇలాంటి నిర్ణయమే తీసుకున్నాడు. అంతర్జాతీయ సర్క్యూట్ నుంచి కొంతకాలం బయటకు వచ్చి డొమెస్టిక్ క్రికెట్ ఆడాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నాడు. అందులో భాగంగా సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి బయటకు వచ్చాడు. 


ఈ పరిణామాలను బట్టి చూస్తే టీ20 లీగ్‌లు వన్డే క్రికెట్‌పై తీవ్ర ప్రభావం చూపుతున్నాయన్న వాదన వినిపిస్తోంది. అయితే, ఈ వాదనను టీమిండియా స్కిప్పర్ రోహిత్ శర్మ కొట్టిపడేశాడు. తనకు అన్ని ఫార్మాట్లు ముఖ్యమేనని పేర్కొన్నాడు. వన్డేల్లో తనకంటూ ఓ పేరు సంపాదించుకున్నానన్న రోహిత్.. 50 ఓవర్ ఫార్మాట్‌కు ముప్పు ఉందన్న వార్తలను ‘నాన్సెన్స్’ అంటూ కొట్టిపడేశాడు. అంతకుముందు టెస్ట్ క్రికెట్ ప్రమాదంలో పడిందని అన్నారని, ఇప్పుడేమో వన్డేలు అంటున్నారని ఎద్దేవా చేశాడు. 


అది ఏ ఫార్మాట్‌లో ఉన్నా తనకు క్రికెట్ ఎంతో ముఖ్యమని రోహిత్ చెప్పుకొచ్చాడు. వన్డేల కథ ముగిసింది.. టీ20ల పని అయిపోయింది..టెస్టులు ప్రమాదంలో పడ్డాయి.. అని తాను చెప్పబోనన్నాడు. తనకోసం మరో ఫార్మాట్ కూడా ఉండాలని అనుకుంటానని రోహిత్ చెప్పుకొచ్చాడు. ఆడడం అనేది ముఖ్యమని, ఏ ఫార్మాట్‌ను ఎంచుకోవాలన్న విషయం వ్యక్తిగతమని రోహిత్ పేర్కొన్నాడు. తనవరకు చెప్పుకోవాలంటూ మూడు ఫార్మాట్లూ ముఖ్యమేనని రోహిత్ వివరించాడు.  

Updated Date - 2022-08-18T23:45:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising