ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భువీ కష్టమే!

ABN, First Publish Date - 2022-01-26T09:19:49+05:30

దక్షిణాఫ్రికాలో పర్యటనను ముగించుకున్న టీమిండియా ఇప్పుడు వెస్టిండీ్‌సతో స్వదేశంలోనే..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విండీస్‌తో సిరీస్‌కు రోహిత్‌ ఫిట్‌

న్యూఢిల్లీ: దక్షిణాఫ్రికాలో పర్యటనను ముగించుకున్న టీమిండియా ఇప్పుడు వెస్టిండీ్‌సతో స్వదేశంలోనే జరిగే పరిమిత ఓవర్ల సిరీ్‌సపై దృష్టి సారించింది. వచ్చే నెల 6 నుంచి మూడు వన్డేలు, మూడు టీ20లు జరుగనున్నాయి. అయితే ఈ రెండు సిరీ్‌సల కోసం భారత జట్టులో మార్పులు ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా పేసర్‌ భువనేశ్వర్‌, స్పిన్నర్‌ అశ్విన్‌ ఇటీవలి కాలంలో ఏమాత్రం ప్రభావం చూపలేదు. దీంతో వీరిపై వేటు ఖాయంగానే కనిపిస్తోంది. అలాగే స్టార్‌ పేసర్‌ బుమ్రాకు విశ్రాంతినిచ్చే అవకాశం ఉంది. అయితే హార్దిక్‌, జడేజా మరికొంతకాలం జట్టుకు దూరం కానున్నారు. వాషింగ్టన్‌ సుందర్‌, అక్షర్‌ పటేల్‌ ఎంపికకు అందుబాటులో ఉన్నారు. ఇక అన్నింటికంటే ముఖ్యంగా రెగ్యులర్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఈ సిరీ్‌సకు అందుబాటులో ఉండే అవకాశం ఉందనే వార్త అభిమానులకు సంతోషపరుస్తోంది.


తొడ కండరాల గాయం నుంచి అతడు పూర్తిగా కోలుకుని మ్యాచ్‌ ఫిట్‌నె్‌సతో ఉన్నాడని సమాచారం. దీంతో రాహుల్‌ మిడిలార్డర్‌లో ఆడనున్నాడు. ‘ఎన్‌సీఏ నుంచి అధికారికంగా రోహిత్‌ ఫిట్‌నె్‌సపై ఇంకా ఎలాంటి సమాచారం రాకపోయినా.. మాకు తెలిసినంత వరకు అతడు తిరిగి జట్టులో చేరేందుకు తీవ్రంగా కష్టపడుతున్నాడు. టీమ్‌ వెంట కెప్టెన్‌ ఉండడం చాలా ముఖ్యం. అలాగే రోహిత్‌ రాకతో ఆటగాళ్లలోనూ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఇంగ్లండ్‌తో సిరీస్‌ ముగియగానే విండీస్‌ ఇక్కడికి వస్తుంది. అహ్మదాబాద్‌, కోల్‌కతాలో పటిష్టమైన బయో బబుల్‌ను ఏర్పాటు చేశాం’ అని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. 

Updated Date - 2022-01-26T09:19:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising