ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రోహిత్‌కు కరోనా

ABN, First Publish Date - 2022-06-27T09:57:59+05:30

భారత క్రికెట్‌ జట్టు లో మరో ఆటగాడు కరోనా బారిన పడ్డాడు. ఈసారి జట్టు కెప్టెన్‌ రోహిత్‌ శర్మ పాజిటివ్‌గా తేలడంతో ఇంగ్లండ్‌తో టెస్టుకు ముందే గట్టి ఎదురుదెబ్బ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బుమ్రాకు పగ్గాలు!

 ఇంగ్లండ్‌తో టెస్టుకు సందేహమే

లీసెస్టర్‌షైర్‌: భారత క్రికెట్‌ జట్టు లో మరో ఆటగాడు కరోనా బారిన పడ్డాడు. ఈసారి జట్టు కెప్టెన్‌ రోహిత్‌ శర్మ పాజిటివ్‌గా తేలడంతో ఇంగ్లండ్‌తో టెస్టుకు ముందే గట్టి ఎదురుదెబ్బ తగిలినట్టయింది. అశ్విన్‌ తర్వాత జట్టులో ఇది రెండో కరోనా కేసు కాగా.. కోహ్లీ కూడా ఇప్పటికే కరోనా నుంచి కోలుకున్నట్టు కథనాలు వినిపించాయి. ఇక రోజువారీ ర్యాపిడ్‌ యాంటీజెన్‌ టెస్టులో భాగంగా శనివారం చేసిన పరీక్షలో రోహిత్‌ పాజిటివ్‌గా తేలాడు. దీంతో ఐదు రోజులపాటు టీమ్‌ హోటల్‌లోనే అతడు ఐసోలేషన్‌లో ఉంటాడని బీసీసీఐ ట్వీట్‌ చేసింది.


బోర్డు మెడికల్‌ టీమ్‌ రోహిత్‌ను పర్యవేక్షిస్తోంది. ఈనేపథ్యంలో వచ్చే నెల 1నుంచి జరిగే టెస్టుకు అతడు అందుబాటులో ఉండే విషయమై సందేహం నెలకొంది. లీసెస్టర్‌షైర్‌ కౌంటీతో జరిగిన ప్రాక్టీస్‌ మ్యాచ్‌ తొలి రోజు రోహిత్‌ బ్యాటింగ్‌ చేయగా.. రెండో రోజు ఫీల్డింగ్‌ చేయలేదు. అలాగే రెండో ఇన్నింగ్స్‌లోనూ బ్యాటింగ్‌కు దూరంగానే ఉన్నాడు. ఈ వామప్‌ మ్యాచ్‌కు ముందు రోహిత్‌ లండన్‌ వీధుల్లో ఎలాంటి కరోనా జాగ్రత్తలు తీసుకోకుండా స్వేచ్ఛగా షాపింగ్‌ చేయడం విమర్శలకు దారితీసింది.


కెప్టెన్‌ ఎవరో..?

ఇంగ్లండ్‌తో టెస్టుకు రోహిత్‌ అందుబాటులో ఉండేదీ.. లేనిదీ ఆర్‌టీపీసీఆర్‌ టెస్టు ఫలితంపై ఆధారపడి ఉంది. ఒకవేళ శుక్రవారం నుంచి జరిగే టెస్టుకు అందుబాటులో లేకపోతే భారత కెప్టెన్‌గా ఎవరు వ్యవహరిస్తారనే విషయమై ఆసక్తి నెలకొంది. వైస్‌ కెప్టెన్‌ రాహుల్‌ గాయం కారణంగా ఈ టూర్‌కే దూరమయ్యాడు. అతడి స్థానంలో బుమ్రాను ఉపసారథిగా ప్రకటించారు. అయితే ఇప్పటివరకు అతడికి ఏ స్థాయి క్రికెట్‌లోనూ కెప్టెన్సీ అనుభవం లేదు. అయినా ముందుకెళ్తే 35 ఏళ్ల తర్వాత (కపిల్‌దేవ్‌) ఓ పేసర్‌ టెస్టు సారథిగా వ్యవహరించినట్టవుతుంది.


ఒకవేళ కెప్టెన్సీ భారం అతడి బౌలింగ్‌పై ప్రభావం పడుతుందనుకుంటే టీమ్‌ మేనేజ్‌మెంట్‌ రిషభ్‌ పంత్‌ వైపు మొగ్గు చూపవచ్చు. కానీ దక్షిణాఫ్రికాతో సిరీ్‌సకు నాయకత్వం వహించిన పంత్‌ పలు విమర్శలు ఎదుర్కొన్నాడు. తిరిగి విరాట్‌ కోహ్లీనే ఈ ఒక్క టెస్టుకు కెప్టెన్‌గా నియమించే చాన్స్‌ లేకపోలేదనే అభిప్రాయాలూ వినిపిస్తున్నాయి. మరోవైపు ఓపెనర్‌ గిల్‌కు జతగా కేఎస్‌ భరత్‌, విహారిలో ఒకరు ఇన్నింగ్స్‌ ఆరంభించవచ్చు.

Updated Date - 2022-06-27T09:57:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising