ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Roger Federer: కెరియర్‌లో చివరి మ్యాచ్‌కు సిద్ధమైన ఫెదరర్.. స్టార్‌ప్లేయర్లతో లండన్‌లో షికారు!

ABN, First Publish Date - 2022-09-24T01:37:08+05:30

రిటైర్మెంట్ ప్రకటించిన టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ (Roger Federer) కెరియర్‌లో చివరి ఏటీపీ టూర్ మ్యాచ్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లండన్: రిటైర్మెంట్ ప్రకటించిన టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ (Roger Federer) కెరియర్‌లో చివరి ఏటీపీ టూర్ మ్యాచ్ ఆడేందుకు సిద్ధమయ్యాడు. లండన్‌ (London)లో నేటి నుంచి ప్రారంభం కానున్న లావెర్ కప్-2022 (Laver Cup-2022)లో సత్తా చాటి కెరియర్‌ను ఘనంగా ముగించాలని పట్టుదలగా ఉన్నాడు. అంతకంటే ముందు కెరియిర్‌లో చివరి క్షణాలను ఆస్వాదిస్తున్నాడు. లావెర్ కప్ ప్రారంభోత్సవం సందర్భంగా గురువారం రాత్రి టెన్నిస్ ఫ్యాబ్-4లోని స్టార్ ఆటగాళ్లు రఫెల్ నాదల్ (Rafael Nadal), నొవాక్ జొకోవిక్(Novak Djokovic), ఆండీముర్రే (Andy Murray)తో కలిసి లండన్ వీధుల్లో షికారు చేశాడు. ‘స్నేహితులు రఫెల్ నాదల్, నొవాక్ జొకోవిక్, ఆండీ ముర్రేలతో కలిసి డిన్నర్‌కు వెళ్తున్నా’ అంటూ ట్వీట్టర్‌లో షేర్ చేసిన ఫొటో ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. లక్షలాది లైకులు, వేలాది రీట్వీట్‌లు, కామెంట్లతో ట్విట్టర్ హోరెత్తిపోతోంది. 


దీర్ఘకాల ప్రత్యర్థి, స్నేహితుడు అయిన రఫేల్ నాదల్‌తో కలిసి ఫెదరర్ తన ఏటీపీ టూర్ మ్యాచ్‌ను ఆడనున్నాడు.  2017 లావెర్ కప్‌లోనూ వీరిద్దరూ ఆడారు. నాదల్ (22), జొకోవిక్ (21), ఫెదరర్ (20), ఆండీ ముర్రే (3) కలిసి 66 గ్రాండ్‌స్లామ్‌లు సాధించారు. మోకాలి నొప్పితో బాధపడుతున్న ఫెదరర్ 2021 వింబుల్డన్ క్వార్టర్-ఫైనల్ మ్యాచ్ ఆడలేకపోయాడు. 41 ఏళ్ల ఈ స్విస్ గ్రేట్ గతవారం రిటైర్మెంట్ ప్రకటించాడు. రెండు దశాబ్దాలుగా నాదల్‌తో పోటీని ఆస్వాదించాడు. పురుషుల టెన్సిస్‌లో ఇద్దరు కలిసి 42 గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు సాధించారు. వీరిద్దరూ 9 గ్రాండ్‌స్లామ్ ఫైనల్స్ సహా 40 మ్యాచుల్లో తలపడ్డారు. నాదల్ 24, ఫెదరర్ 16 విజయాలు సాధించారు. అయితే, నేటి మ్యాచ్‌లో మాత్రం ఇద్దరూ కలిసి బరిలోకి దిగనున్నారు. ఫెదరర్-నాదల్ జంట.. జాక్ సోక్-ఫ్రాన్సెస్ టియాఫో జంటతో తలపడుతుంది.

 

2003 వింబుల్డన్‌లో తొలిసారి విజేతగా నిలిచి టైటిల్ సొంతం చేసుకున్న ఫెదరర్.. తన 24 ఏళ్ల సుదీర్ఘ కెరియర్‌లో మొత్తంగా 6 ఆస్ట్రేలియా ఓపెన్, 8 వింబుల్డన్, 5 యూఎస్ ఓపెన్ టైటిళ్లతో పాటు ఒక ఫ్రెంచ్ ఓపెన్ గెలిచి పురుషుల సింగిల్స్‌లో 20 గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్లు సాధించిన తొలి ఆటగాడిగా రికార్డులకెక్కాడు.

Updated Date - 2022-09-24T01:37:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising