ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పంత్‌ ప్రతాపం

ABN, First Publish Date - 2022-03-05T09:34:49+05:30

రోహిత్‌ కెప్టెన్సీలో మొదటిది.. కోహ్లీ కెరీర్‌లో వందోదీ అయిన తాజా టెస్టులో ఆ ఇద్దరూ ఓ మాదిరిగానే రాణించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ 357/6

విహారి అర్ధసెంచరీ

శ్రీలంకతో తొలి టెస్టు

90+స్కోరులో అవుటవడం 

రిషభ్‌ పంత్‌కిది ఐదోసారి


భారత్‌ తరఫున టెస్టుల్లో 8వేల పరుగులు పూర్తి చేసిన ఆరో బ్యాటర్‌ కోహ్లీ. విరాట్‌ కంటే ముందు సచిన్‌ (15,921), ద్రవిడ్‌ (13265), గవాస్కర్‌ (10122), లక్ష్మణ్‌ (8781), సెహ్వాగ్‌ (8503) ఉన్నారు.


మొహాలీ: రోహిత్‌ కెప్టెన్సీలో మొదటిది.. కోహ్లీ కెరీర్‌లో వందోదీ అయిన తాజా టెస్టులో ఆ ఇద్దరూ ఓ మాదిరిగానే రాణించారు. కానీ యువ వికెట్‌ కీపర్‌ రిషభ్‌ పంత్‌ (97 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్సర్లతో 96) మాత్రం అందరి దృష్టినీ తనవైపు తిప్పుకొన్నాడు. అటు హనుమ విహారి (128 బంతుల్లో 5 ఫోర్లతో 58) కూడా సత్తా చాటడంతో భారత్‌ భారీ స్కోరుతో తొలి టెస్టులో శ్రీలంకపై పట్టు బిగిస్తోంది. దీంతో తొలి రోజు శుక్రవారం ఆట ముగిసేసరికి భారత్‌ మొదటి ఇన్నింగ్స్‌ లో 85 ఓవర్లలో 6 వికెట్లకు 357 పరుగుల భారీ స్కోరు సాధించింది. కోహ్లీ (76 బంతుల్లో 5 ఫోర్లతో 45) ఫర్వాలేదనిపించాడు. క్రీజులో జడేజా (45 బ్యాటింగ్‌), అశ్విన్‌ (10 బ్యాటింగ్‌) ఉన్నారు. 


జోరుగా ఆరంభం: 

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ తొలి సెషన్‌లోనే 109 పరుగులు సాధించింది. మయాంక్‌ (33), రోహిత్‌ (29) ఆరంభంలో వేగంగా ఆడి తొలి వికెట్‌కు 52 పరుగులు జత చేశారు. కానీ లాహిరు షార్ట్‌ పిచ్‌ బాల్‌ను భారీషాట్‌ ఆడే క్రమంలో రోహిత్‌ అవుటయ్యాడు. 


విహారి అర్ధసెంచరీ:

విహారి, విరాట్‌ లంక బౌలర్లను నిలకడగా ఎదుర్కొన్నా.. ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడీని విడదీయగలిగారు. ఈ క్రమంలో 36వ ఓవర్‌లో విహారి అర్ధసెంచరీ పూర్తి చేశాడు. అటు కోహ్లీ కూడా అద్భుత షాట్లతో ఆకట్టుకోవడంతో శతక టెస్టులో సెంచరీపై ఆశలు రేపాడు. కానీ ఎంబుల్డెనియా మేజిక్‌ బాల్‌కు అతడు అర్ధసెంచరీ ముంగిట బౌల్డ్‌ కావాల్సి వచ్చింది. గుడ్‌ లెంగ్త్‌ బాల్‌ను కోహ్లీ డిఫెన్స్‌ ఆడాలని చూడగా బంతి అనూహ్యంగా అవుడ్‌సైడ్‌ ఎడ్జ్‌ తీసుకుని ఆఫ్‌స్టం్‌పను పడేసింది. దీంతో అటుకోహ్లీతో పాటు అభిమానులు కూడా షాక్‌కు గురయ్యారు. మూడో వికెట్‌కు 90 పరుగుల భాగస్వామ్యం జత చేరింది. కొద్దిసేపటికే విహారి కూడా ఫెర్నాండో చేతిలో బౌల్డ్‌ అయ్యాడు. ఈ దశలో పంత్‌, శ్రేయాస్‌ (27) టీ బ్రేక్‌కు వెళ్లారు. 


పంత్‌ బాదుడు:

చివరి సెషన్‌లో రిషభ్‌ పంత్‌ అదరగొట్టడంతో భారత్‌ 158 పరుగులు సాధించింది. శ్రేయాస్‌ అవుటైన సమయానికి జట్టు స్కోరు 228. కానీ  జడేజాతో జత కట్టిన పంత్‌ తనదైన షాట్లతో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఆరో వికెట్‌కు 104 పరుగుల భాగస్వామ్యం అందించాడు. 73 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసేవరకు టెస్టు తరహా ఆటతీరునే కనబర్చిన పంత్‌.. ఆ తర్వాత బ్యాట్‌ ఝుళిపించి 24 బంతుల్లోనే మరో 46 రన్స్‌ సాధించాడు. ఎంబుల్డెనియా వేసిన ఇన్నింగ్స్‌ 76వ ఓవర్‌లో 6,6,4,0,2,4తో 22 రన్స్‌ రాబట్టి స్టేడియంలో జోష్‌ నింపాడు. తర్వాతి ఓవర్‌లోనూ 4,6తో జట్టు స్కోరు 300 దాటింది. ఈ ఊపులో మరో రెండు వరుస ఫోర్లతో సెంచరీకి అతి సమీపంలో నిలిచాడు. కానీ ఈ దశలో కొత్త బంతితో పంత్‌ను లక్మల్‌ బౌల్డ్‌ చేశాడు. ఆ తర్వాత నాలుగు ఓవర్లకే తొలిరోజు ఆట ముగిసింది.


భారత్‌ తొలి ఇన్నింగ్స్‌:

మయాంక్‌ (ఎల్బీ) ఎంబుల్డెనియా 33, రోహిత్‌ (సి) లక్మల్‌ (బి) లాహిరు 29, విహారి (బి) ఫెర్నాండో 58, విరాట్‌ (బి) ఎంబుల్డెనియా 45, పంత్‌ (బి) లక్మల్‌ 96; శ్రేయాస్‌ (ఎల్బీ) ధనంజయ 27, జడేజా (బ్యాటింగ్‌) 45, అశ్విన్‌ (బ్యాటింగ్‌) 10, ఎక్స్‌ట్రాలు: 14; మొత్తం: 85 ఓవర్లలో 357/6; వికెట్ల పతనం: 1-52, 2-80, 3-170, 4-175, 5-228, 6-332; బౌలింగ్‌: లక్మల్‌ 16-1-63-1, ఫెర్నాండో 16-1-69-1, లాహిరు 10.5-1-52-1, ఎంబుల్డెనియా 28-2-107-2, ధనంజయ 11-1-47-1, అసలంక 3.1-0-14-0.

Updated Date - 2022-03-05T09:34:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising