ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దక్షిణాఫ్రికాతో రెండో టెస్టు.. పంత్ అర్ధ సెంచరీ

ABN, First Publish Date - 2022-01-21T21:38:49+05:30

దక్షిణాఫ్రికాతో ఇక్కడ జరుగుతున్న రెండో వన్డేలో భారత్ స్కోరు వంద పరుగులు దాటింది. కెప్టెన్ కేఎల్ రాహుల్‌తో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పార్ల్: దక్షిణాఫ్రికాతో ఇక్కడ జరుగుతున్న రెండో వన్డేలో భారత్ దూకుడుగా ఆడుతోంది. కెప్టెన్ కేఎల్ రాహుల్‌తో కలిసి వికెట్ కీపర్ రిషభ్ పంత్ సంయమనంతో ఆడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టిస్తున్నాడు. ఈ క్రమంలో 43 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తిచేసుకున్నాడు. ఇందులో ఆరు ఫోర్లు, సిక్సర్ ఉన్నాయి. వన్డేల్లో పంత్‌కు ఇది నాలుగో అర్ధ సెంచరీ. అర్ధ సెంచరీ తర్వాత మరింత జోరు పెంచిన పంత్ మరో రెండు ఫోర్లు బాదాడు.


ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న  భారత్‌కు ఓపెనర్లు  కేఎల్ రాహుల్, శిఖర్ ధవన్ శుభారంభాన్ని ఇచ్చారు. ఇద్దరూ కలిసి తొలి వికెట్‌కు 63 పరుగులు జోడించారు. ఈ క్రమంలో 29 పరుగులు చేసిన ధవన్.. మార్కరమ్ బౌలింగులో మగలకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కోహ్లీ తడబడ్డాడు. ఐదు బంతులు ఆడి చివరికి డకౌట్‌గా వెనుదిరిగి అభిమానులు తీవ్రంగా నిరాశపరిచాడు.


అనంతరం క్రీజులోకి వచ్చిన పంత్ రాహుల్‌తో చక్కని సమన్వయంతో ఆడుతూ వికెట్ల పతనానికి అడ్డుకట్ట వేశాడు. ఇద్దరూ స్ట్రైక్ రొటేట్ చేస్తూ స్కోరు బోర్డుపై పరుగులు పేర్చుకుంటూ పోయారు. ప్రస్తుతం 26 ఓవర్లు ముగిశాయి. ఇండియా రెండు వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసింది. రాహుల్ 46, పంత్ 61 పరుగులతో క్రీజులో ఉన్నాయి.

Updated Date - 2022-01-21T21:38:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising