ఇంగ్లండ్ పిన్నవయసు టెస్ట్ క్రికెటర్‌గా రేహాన్?
ABN, First Publish Date - 2022-11-25T03:22:05+05:30
ఇంగ్లండ్ పిన్నవయసు టెస్ట్ క్రికెటర్‌గా 18 ఏళ్ల రేహాన్ అహ్మద్ సరికొత్త రికార్డు సృష్టించే అవకాశం ఉంది.
లండన్: ఇంగ్లండ్ పిన్నవయసు టెస్ట్ క్రికెటర్‌గా 18 ఏళ్ల రేహాన్ అహ్మద్ సరికొత్త రికార్డు సృష్టించే అవకాశం ఉంది. పాకిస్థాన్‌లో పర్యటించే ఇంగ్లండ్ టెస్ట్ జట్టులో స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ రేహాన్‌కు చోటుదక్కింది. పాక్‌తో జరిగే మూడు టెస్ట్‌ల సిరీస్ తుది జట్టులో రేహాన్‌కు ఆడే అవకాశం దక్కితే ఇంగ్లండ్ తరఫున టెస్ట్‌ల్లో అరంగేట్రం చేసిన పిన్నవయస్కుడిగా.. 1949లో బ్రియాన్ క్లోజ్ (18 ఏళ్ల 149 రోజులు) రికార్డును బద్దలు కొట్టనున్నాడు. 2004, ఆగస్టు 13న జన్మించిన రేహాన్ ప్రస్తుత వయసు 18 ఏళ్ల 102 రోజులు. కాగా, వచ్చే నెల ఒకటినుంచి రావల్పిండిలో తొలి టెస్ట్ జరగనుంది.
Updated Date - 2022-11-25T03:22:06+05:30 IST