ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

LSG vs RCB: Eliminator మ్యాచ్‌లో RCBలో ఉన్న KGFను కూలగొట్టేందుకు LSG చేతిలో ఉన్న అస్త్రం ఏంటంటే..

ABN, First Publish Date - 2022-05-25T21:50:03+05:30

IPL 2022 సీజన్ తుది దశకు చేరుకుంది. క్వాలిఫైయర్-1లో రాజస్తాన్ రాయల్స్ జట్టుపై గెలిచి గుజరాత్ టైటాన్స్ ఇప్పటికే ఫైనల్‌కు వెళ్లింది. మరికొద్ది గంటల్లో..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

IPL 2022 సీజన్ తుది దశకు చేరుకుంది. క్వాలిఫైయర్-1లో రాజస్తాన్ రాయల్స్ జట్టుపై గెలిచి గుజరాత్ టైటాన్స్ ఇప్పటికే ఫైనల్‌కు వెళ్లింది. మరికొద్ది గంటల్లో ఎలిమినేటర్ మ్యాచ్ జరగబోతోంది. ఈ Eliminator మ్యాచ్ లక్నో సూపర్ జెయింట్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జరగబోతోంది. ఈ మ్యాచ్‌లో ఓడిన టీం ఇంటికెళుతుంది. గెలిచిన టీం ముందుకెళుతుంది. కోల్‌కత్తా జట్టుపై థ్రిల్లింగ్ విక్టరీతో గెలుపు జోష్‌లో ఉన్న LSG జట్టు ఈ సీజన్‌లో మంచి ఆటతీరు కనబర్చింది. 14 మ్యాచ్‌లు ఆడి 9 గెలిచి, ఐదు ఓడింది. 14 మ్యాచుల్లో RCB జట్టు 8 గెలిచి, ఆరు ఓడింది. మూడు, నాలుగు స్థానాల్లో ఉన్న ఈ రెండు జట్లు కోల్‌కత్తాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా చావోరేవో తేల్చుకునేందుకు సిద్ధమయ్యాయి. అయితే.. RCB Batting Line-up KGFతో దృఢంగా ఉంది. Kohli, Glenn Maxwell, Faf du Plessis రాయల్ ఛాలెంజర్స్ బ్యాటింగ్ విభాగంలో కీలకంగా ఉన్నారు.



ఈ ముగ్గురూ సరైన ఆటతీరు కనబర్చి రాణిస్తే మాత్రం LSG సవాల్ ఎదుర్కోక తప్పదు. అందుకే.. ఈ KGFను కూలగొట్టేందుకు LSG ఒక Secret Weaponను సిద్ధం చేసింది. ఆ అస్త్రం పేరే మొహ్సిన్ ఖాన్. 23 ఏళ్ల ఈ యువ చిచ్చర పిడుగు కోల్‌కత్తాతో జరిగిన మ్యాచ్‌లో 4 ఓవర్లు బౌలింగ్ చేసి 20 పరుగులు మాత్రమే ఇచ్చి 3 కీలక వికెట్లు తీసి సత్తా చాటాడు. Left-arm Pacersను ఢీ కొని నిలవడంలో ఒక్క Faf du Plessisను మినహాయిస్తే కోహ్లీ, మ్యాక్స్‌వెల్ అంత దృఢంగా లేరు. అత్యుత్తమ బౌలింగ్‌తో రాణిస్తున్న Left-arm Pacer మొహ్సిన్ ఖాన్‌పై LSG కొండంత ఆశలు పెట్టుకుంది. RCB బ్యాటింగ్ లైనప్‌ను కూలగొట్టడంలో మొహ్సిన్ ఖాన్ బౌలింగ్ ఉపకరిస్తుందని భావిస్తోంది.

Updated Date - 2022-05-25T21:50:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising