ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

England vs India: జడేజా సెంచరీ.. భారీ స్కోరు దిశగా టీమిండియా

ABN, First Publish Date - 2022-07-02T21:10:59+05:30

ఇంగ్లండ్‌తో జరుగుతున్న చివరిదైన ఐదో టెస్టు (రీషెడ్యూల్డ్ మ్యాచ్)లో భారత జట్టు భారీ స్కోరు దిశగా దూసుకెళ్తోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బర్మింగ్‌హామ్: ఇంగ్లండ్‌ (England)తో జరుగుతున్న చివరిదైన ఐదో టెస్టు (రీషెడ్యూల్డ్ మ్యాచ్)లో భారత జట్టు భారీ స్కోరు దిశగా దూసుకెళ్తోంది. ఓవర్‌నైట్ స్కోరు 338/7తో రెండో రోజు ఆట ప్రారంభించిన భారత్ (Team India) అదే నిలకడగా కొనసాగిస్తూ పరుగులు రాబట్టే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో 83 పరుగులతో క్రీజులోకి వచ్చిన రవీంద్ర జడేజా (Ravindra Jadeja) మరో 17 పరుగులు జోడించి టెస్టుల్లో మూడో సెంచరీ పూర్తి చేసుకున్నాడు.


మొత్తం 183 బంతులు ఎదుర్కొన్న జడేజా 13 ఫోర్లతో శతకం సాధించాడు.  అయితే, ఆ తర్వాత కాసేపటికే  అతడికి అండగా నిలిచిన షమీ (Mohammed Shami) అవుటయ్యాడు. 16 పరుగులు మాత్రమే చేసిన షమీ.. బ్రాడ్ బౌలింగులో జాక్ లీచ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం జడేజా (102), బుమ్రా క్రీజులో ఉన్నారు. భారత్ 8 వికెట్ల నష్టానికి 373 పరుగులు చేసింది. కాగా, తొలి రోజు టాపార్డర్ కుప్పకూలిన వేళ వైస్ కెప్టెన్ రిషభ్ పంత్ (Rishabh Pant) ఆపద్బాంధవుడయ్యాడు. 111 బంతుల్లో 20 ఫోర్లు, 4  సిక్సర్లతో 146 పరుగులు చేసి భారత్ పటిష్ఠ స్థితికి చేరుకోవడానికి పునాదులు వేశాడు.

Updated Date - 2022-07-02T21:10:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising