ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కపిల్‌దేవ్ రికార్డును బ్రేక్ చేసిన రవీంద్ర జడేజా

ABN, First Publish Date - 2022-03-05T21:29:27+05:30

టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా అద్భుతమైన రికార్డు సాధించాడు. శ్రీలంకతో జరుగుతున్న తొలి..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మొహాలీ: టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా అద్భుతమైన రికార్డు సాధించాడు. శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టు రెండో రోజు అజేయంగా 175 పరుగులు చేసిన జడేజా.. భారత దిగ్గజ క్రికెటర్ కపిల్‌దేవ్ రికార్డును బద్దలుగొట్టాడు. ఏడో స్థానంలో బ్యాటింగుకు దిగి 150, అంతకంటే ఎక్కువ పరుగులు సాధించిన భారత మూడో క్రికెటర్‌గా రికార్డు పుస్తకాల్లో తన పేరు లిఖించుకున్నాడు.


జడేజా కంటే ముందు కపిల్‌దేవ్, రిషభ్ పంత్ ఈ ఘనత సాధించారు. అంతేకాదు, జడేజా ఖాతాలో మరో రికార్డు కూడా వచ్చి చేరింది. ఏడో నంబరులో బ్యాటింగుకు దిగి 300 పైచిలుకు పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పడంలో భాగం పంచుకున్న తొలి వ్యక్తిగానూ అవతరించాడు.  నంబరు 7 అంతకంటే తక్కువ స్థానంలో బ్యాటింగుకు దిగి అజేయంగా 175 పరుగులు సాధించిన తొలి ఇండియన్‌గానూ జడేజా రికార్డు సృష్టించాడు.  


అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 357/6తో రెండో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన భారత జట్టు 574/8 వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. రవిచంద్రన్ అశ్విన్ 61 పరుగులు చేసి అవుట్ కాగా, షమీ 20 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన శ్రీలంక 59 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది.  కెప్టెన్ దిముత్ కరుణరత్నె 28, లహిరు తిరిమన్నె 17 పరుగులు చేసి అవుటయ్యారు. 


Updated Date - 2022-03-05T21:29:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising