ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్.. నెంబర్ వన్ ఆల్‌రౌండర్‌గా జడేజా

ABN, First Publish Date - 2022-03-10T02:57:40+05:30

టీమిండియా క్రికెటర్ రవీంద్ర జడేజా ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్ ఆల్‌రౌండర్ల జాబితాలో అగ్రస్థానానికి ఎగబాకాడు. ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: టీమిండియా క్రికెటర్ రవీంద్ర జడేజా ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్ ఆల్‌రౌండర్ల జాబితాలో అగ్రస్థానానికి ఎగబాకాడు. శ్రీలంకతో ఇటీవల జరిగిన తొలి టెస్టులో అద్భుతమైన ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్న జడేజా.. వెస్టిండీస్ ఆల్‌రౌండర్ జాసన్ హోల్డర్‌ను వెనక్కి నెట్టేసి టాప్ ప్లేస్‌కు చేరుకున్నాడు.


శ్రీలంకతో మొహాలీలో జరిగిన తొలి టెస్టులో జడేజా 175 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. జడేజా అగ్రస్థానానికి చేరుకోవడంతో హోల్డర్ రెండో స్థానానికి, టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మూడో స్థానానికి పడిపోయాడు. వందో టెస్టు ఆడిన టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ టెస్టు బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో తిరిగి ఐదో స్థానానికి చేరుకున్నాడు. మొహాలీ టెస్టులో 96 పరుగులు చేసిన వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ రిషభ్ పంత్ తిరిగి టాప్-10లో చోటు సంపాదించుకున్నాడు. 


ఆస్ట్రేలియా ఆటగాడు మార్నస్ లబుషేన్ 936 రేటింగ్ పాయింట్లతో ప్రపంచ నంబర్ వన్ బ్యాటర్‌‌గా తన స్థానాన్ని పదిలం చేసుకున్నాడు.  కోహ్లీ ఐదు, రోహిత్ శర్మ ఏడు, రిషభ్ పంత్ పదో స్థానంలో నిలిచారు. బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో పెద్దగా మార్పులు లేవు.  

Updated Date - 2022-03-10T02:57:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising