ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Ravi Shastri: రవిశాస్త్రిపై దినేష్ కార్తీక్ సంచలన వ్యాఖ్యలు..

ABN, First Publish Date - 2022-08-17T21:49:01+05:30

రవిశాస్త్రి - విరాట్ కోహ్లీ (Ravi shastri- Virat Kohli) ద్వయం సమయంలో టీమిండియా మెరుగైన ప్రదర్శనే చేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై : కోచ్‌గా రవిశాస్త్రి  - కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ (Ravi shastri- Virat Kohli) ఉన్న సమయంలో టీమిండియా (Team India) మెరుగైన ప్రదర్శన చేసింది. అయితే కొంతమంది ఆటగాళ్లకు అండగా నిలవలేదనే విమర్శలు వ్యక్తమయ్యాయి. విఫలమవుతున్న ఆటగాళ్ల విషయంలో ఏమాత్రం సానుభూతి చూపలేదనే వాదనలున్నాయి. ఈ ఆరోపణలకు బలం చేకూర్చుతూ వికెట్‌కీపర్ దీనేష్ కార్తీక్ (Dinesh Karthik) నోరువిప్పాడు. ప్రత్యేకత చాటుకోవాలంటూ రవిశాస్త్రి ఆటగాళ్లకు ఎప్పుడూ  చెబుతుండేవాడని, అయితే ఆటగాళ్లు విఫలమైతే మాత్రం తక్కువ సహనాన్ని చూపేవాడని పేర్కొన్నాడు. 


‘‘ ఒకస్థాయి వేగంతో బ్యాటింగ్ చేయలేని కొంతమంది బ్యాట్స్‌మెన్ల విషయంలో రవిశాస్త్రికి ఓర్పు చాలా తక్కువగా ఉండేది. నెట్స్‌లో ఒకలాగ.. మ్యాచ్‌లో పూర్తి విభిన్నంగా ఆడినా అతడికి నచ్చేదికాదు’’ అని కార్తీక్  చెప్పాడు. ‘ టీమ్‌కి ఏమి అవసరమో రవిశాస్త్రికి తెలుసు. ఆవిధంగానే మ్యాచ్ జరుగుతుంది. కానీ ఆటగాళ్లు విఫలమైతే మాత్రం చాలా తక్కువ సహనం చూపేవాడు. అయితే బాగా రాణించాలని ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తుండేవాడు ’’ అని కార్తీక్ చెప్పాడు. ‘ క్రిక్‌బజ్’(Cricbuzz) డాక్‌సిరీస్‌ ‘సమ్మర్ స్టేల్‌మేట్’లో ఈ విషయాలను వెల్లడించాడు. కాగా గతంలో ఓ సందర్భంలో మాట్లాడుతూ.. రోహిత్ శర్మ - రాహుల్ ద్రావిడ్ కాలంలో సంతృప్తికరంగా  ఉన్నానని దినేష్ కార్తీక్ చెప్పాడు.


కాగా రవిశాస్త్రి కోచ్‌గా ఉన్నప్పుడు దినేష్ కార్తీక్ జట్టులోకి వచ్చిపోతుండేవాడు. ముఖ్యంగా 2019 వరల్డ్ కప్ సమయంలో ఈ పరిస్థితిని ఎదుర్కొన్నాడు. ప్రస్తుతం కార్తీక్ టీ20 మ్యాచ్‌ల్లో అద్భుతమైన ఫినిషర్‌గా రాటుదేలాడు. పునరాగమనం తర్వాత సత్తా చాటుకుంటున్నాడు. ప్రస్తుతం ఆసియా కప్‌లోనూ చోటు దక్కించుకున్నాడు. అయితే తుది జట్టులో అవకాశం లభిస్తుందో వేచిచూడాలి. మరోవైపు రవిశాస్త్రి కోచ్‌గా ఉన్నప్పుడు టీమిండియా చక్కటి విజయాలను సాధించింది. ముఖ్యంగా ఆస్ట్రేలియా గడ్డపై 2 టెస్ట్ సిరీస్‌లు సొంతం చేసుకుంది. ఇంగ్లండ్‌లో టెస్ట్ సిరీస్ 2-2 సమం చేసింది. అంతేకాకుండా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో భారత్ ఫైనల్‌కు కూడా చేరిన విషయం తెలిసిందే. 

Updated Date - 2022-08-17T21:49:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising