ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భారత టీ20 ప్రపంచకప్ జట్టులోకి ఉమ్రాన్ మాలిక్‌ను తీసుకోవద్దు: రవిశాస్త్రి

ABN, First Publish Date - 2022-06-11T23:35:01+05:30

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH)కు ప్రాతినిధ్యం వహించిన 22 ఏళ్ల జమ్మూకశ్మీర్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH)కు ప్రాతినిధ్యం వహించిన 22 ఏళ్ల జమ్మూకశ్మీర్ పేస్ బౌలింగ్ సెన్సేషన్ ఉమ్రాన్ మాలిక్ పేరు హెడ్‌లైన్స్‌కు ఎక్కింది. అతడికి టీమిండియాలో చోటు ఖాయమేనని భావించారు. అనుకున్నట్టే సెలక్టర్ల నుంచి అతడికి పిలుపు వచ్చింది.


దక్షిణాఫ్రికాలో స్వదేశంలో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు. ఇప్పుడు అతడిని త్వరలో జరగనున్న టీ20 ప్రపంచకప్‌కు కూడా ఎంపిక చేయాలని అభిమానులు, పలువురు మాజీ క్రికెటర్లు కోరుతున్నారు. అయితే, టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి మాత్రం అలాంటి పని చేయొద్దని హెచ్చరిస్తున్నాడు. టీ20 ప్రపంచకప్‌కు ఉమ్రాన్‌ను ఎంపిక చేయడం మరీ తొందరపాటు అవుతుందని పేర్కొన్నాడు. 


ఇప్పటికైతే అతడిని తీసుకోవడం సరికాదని, అతడిని ఎదగనివ్వాలని రవి అన్నాడు. అతడిని రెడ్ బాల్ క్రికెట్, వైట్ బాల్ క్రికెట్ ఆడనివ్వాలని, ఆ తర్వాత అతడిని జట్టులోకి తీసుకోవడంపై ఆలోచించాలని అన్నాడు. న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ డేనియల్ వెటోరీ కూడా ఇలాంటి అభిప్రాయాన్నే వెలిబుచ్చాడు. అతడు జట్టులో ఉన్నా, లేకపోయినా భారత జట్టుతోనే ఉండాలని, తప్పకుండా అతడి సమయం వస్తుందని వెటోరీ చెప్పుకొచ్చాడు. 

Updated Date - 2022-06-11T23:35:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising