ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హైదరాబాద్‌ 347

ABN, First Publish Date - 2022-02-19T08:14:09+05:30

మీడియం పేసర్‌ రక్షణ్‌ రెడ్డి (4/55) చెలరేగడంతో చండీగఢ్‌తో జరుగుతున్న రంజీ మ్యాచ్‌లో హైదరాబాద్‌ జట్టు పట్టు సాధించింది. ఓవర్‌నైట్‌ స్కోరు 270/7తో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చండీగఢ్‌తో  రంజీ


కటక్‌: మీడియం పేసర్‌ రక్షణ్‌ రెడ్డి (4/55) చెలరేగడంతో చండీగఢ్‌తో జరుగుతున్న రంజీ మ్యాచ్‌లో హైదరాబాద్‌ జట్టు పట్టు సాధించింది. ఓవర్‌నైట్‌ స్కోరు 270/7తో రెండోరోజైన శుక్రవారం బ్యాటింగ్‌ కొనసాగించిన హైదరాబాద్‌ 108.4 ఓవర్లలో 347 పరుగులకు ఆలౌటైంది. బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ సీవీ మిలింద్‌ (28), టెయిలెండర్‌ జైస్వాల్‌ (24) కాసేపు బౌలర్ల సహనాన్ని పరీక్షించారు. అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన చండీగఢ్‌ రెండోరోజు ఆట ముగిసేసరికి 63 ఓవర్లలో 6 వికెట్లకు 200 పరుగులు చేసింది. కెప్టెన్‌ మనన్‌ ఓహ్రా శతకం (110)తో సత్తా చాటాడు. ప్రస్తుతం క్రీజులో రాజ్‌ బవా (39) ఉన్నాడు. ఇక, గ్రూప్‌-ఈలో రాజస్థాన్‌తో ఆడుతున్న ఆంధ్ర జట్టు ఓవర్‌నైట్‌ స్కోరు 75/2తో రెండోరోజు బ్యాటింగ్‌ ప్రారంభించి 86.2 ఓవర్లలో 224 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్‌ గిరినాథ్‌ (71) ఒక్కడే రాణించాడు. అనంతరం రెండో ఇన్నింగ్స్‌లో రాజస్థాన్‌ రెండోరోజు ఆట చివరకు 31 ఓవర్లలో 2వికెట్లకు 97 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో రాజస్థాన్‌ 275 రన్స్‌కు ఆలౌటైంది.

Updated Date - 2022-02-19T08:14:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising