ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Rajat Patidar: ఐపీఎల్‌ ఆక్షన్‌లో అన్‌ సోల్డ్ ప్లేయర్‌.. రజత్ పాటిదార్ గురించి ఆసక్తికర విషయాలు..

ABN, First Publish Date - 2022-05-27T03:04:02+05:30

‘ఈ సాల కప్ నమ్‌దే’.. అంటూ ప్రతీ ఏడాది ఐపీఎల్‌ బరిలోకి వస్తున్న ఆర్సీబీ ఈ సారి ప్లేఆఫ్స్‌కు చేరడంతో ఫ్యాన్స్‌ ఉత్సాహంతో ఉన్నారు. ఈసారి కప్ కొడతామంటూ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

‘ఈ సాల కప్ నమ్‌దే’.. అంటూ ప్రతీ ఏడాది ఐపీఎల్‌ బరిలోకి వస్తున్న ఆర్సీబీ ఈ సారి ప్లేఆఫ్స్‌కు చేరడంతో ఫ్యాన్స్‌ ఉత్సాహంతో ఉన్నారు. ఈసారి కప్ కొడతామంటూ కుండబద్ధలు కొడుతున్నారు. కీలకమైన ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో ఆర్సీబీ బ్యాటర్‌ రజత్ పాటిదార్  సెంచరీతో మెరుపులు కురిపించాడు. లక్నో సూపర్ జెయింట్స్‌ మ్యాచ్‌లో పాటిదార్‌ 49 బాల్స్‌లో 11 ఫోర్లు, 6 సిక్సర్లతో సెంచరీ మార్క్ అందుకున్నాడు. ఈ మ్యాచ్‌లో పాటిదార్ 54 బంతుల్లో 112 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఐపీఎల్‌ ఆక్షన్‌లో అన్‌ సోల్డ్ ప్లేయర్‌గా ఉన్న రజత్‌ పాటిదార్‌ ఆర్సీబీలో రీప్లేస్‌మెంట్‌గా వచ్చాడు.



ఆర్‌సీబీ తరపున నాకౌట్‌ మ్యాచ్‌లో సెంచరీ సాధించిన తొలి బ్యాటర్‌గా రజత్ పాటిదార్‌ రికార్డ్‌ సృష్టించాడు. అదే విధంగా ప్లేఆఫ్‌ మ్యాచ్‌లో ఆర్సీబీ తరపున అత్యధిక స్కోర్‌ సాధించిన ఆటగాడిగా రజత్ నిలిచాడు. అన్‌క్యాప్‌డ్ ప్లేయర్‌గా ప్లేఆఫ్ మ్యాచ్‌లో సెంచరీ సాధించిన తొలి బ్యాటర్‌గా రజత్ పాటిదార్ రికార్డ్ నెలకొల్పాడు. ఓవర్‌ఆల్‌గా ప్లే ఆఫ్ మ్యాచ్‌ల్లో సెంచరీ అందుకున్న ఐదో ఆటగాడిగా నిలిచాడు. ఆర్సీబీ ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో విజయం సాధించడానికి పాటిదార్ కీలకమైన ఇన్నింగ్స్ ఆడాడు. అదే సమయంలో మరో ఆర్సీబీ ప్లేయర్‌ దినేశ్ కార్తీక్ తోడవడంతో ఆర్సీబీ విజయ తీరానికి చేరుకుంది. ఓ వైపు లక్నో టీమ్‌ వీరోచితంగా పోరాడినా ఆర్సీబీ చేతిలో ఓటమి పాలవడంతో ఐపీఎల్ 2022 నుంచి ఎలిమినేట్ అయ్యింది.

Updated Date - 2022-05-27T03:04:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising