ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

IPL2022 Final : తుస్సుమన్న రాజస్థాన్ బ్యాటర్లు.. గుజరాత్‌కు ఈజీ టార్గెట్

ABN, First Publish Date - 2022-05-30T03:30:24+05:30

ఐపీఎల్2022(IPL2022) ఫైనల్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్(Rajastan Royals) చతికిలపడింది. టైటిల్ వేటలో గుజరాత్ టైటాన్స్(Gujarat Titans) బౌలర్ల ముందు రాజస్థాన్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అహ్మదాబాద్ : ఐపీఎల్2022(IPL2022) ఫైనల్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్(Rajastan Royals) చతికిలపడింది. టైటిల్ వేటలో గుజరాత్ టైటాన్స్(Gujarat Titans) బౌలర్ల ముందు రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్లు తుస్సుమన్నారు. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 130 పరుగులు మాత్రమే చేయగలిగారు. పటిష్టమైన బ్యాటింగ్ లైనప్ కలిగిన గుజరాత్‌కు రాజస్థాన్ సునాయాస లక్ష్యాన్ని నిర్దేశించారు. రాజస్థాన్ ఇన్నింగ్స్‌ ఆరంభంలో బాగానే ఉన్నా ఆ తర్వాత బ్యాట్స్‌మెన్ తేలిపోయారు. వెంటవెంటనే వికెట్లు కోల్పోయారు. బట్లర్ (39) మాత్రమే ఫర్వాలేదనిపించాడు. మిగతవారు పరుగులు రాబట్టేందుకు తెగ ఇబ్బందిపడ్డారు.


రాజస్థాన్ బ్యాటింగ్..

యశ్వస్వి జైస్వాల్ (22), జాస్ బట్లర్(39), సంజూ శాంసన్(14), దేవధూత్ పడిక్కల్(2), హెట్మేయర్(11), రవిచంద్రన్ అశ్విన్(6), రియాన్ పరాగ్(15), ట్రెంట్ బౌల్ట్(11), మెక్‌కే(8), ప్రిసిద్ కృష్ణ(0, నాటౌట్)  చొప్పున పరుగులు చేశారు. 


గుజరాత్ అదిరిపోయే బౌలింగ్..

గుజరాత్ టైటాన్స్ బౌలర్లు అత్యంత కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. గుజరాత్ కెప్టెన్ హార్ధిక్ అద్భుతంగా బౌలింగ్ చేశారు. 4 ఓవర్లు వేసి 17 పరుగులు మాత్రమే అత్యంత కీలకమైన 3 వికెట్లు తీశాడు. రవిశ్రీనివాసన్ సాయి కిశోర్ 2 వికెట్లు, మొహమ్మద్ షమీ, యస్ దయాల్, రషీద్ ఖాన్ ఒక్కో వికెట్ చొప్పున తీశారు.

Updated Date - 2022-05-30T03:30:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising