ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

England vs India: మళ్లీ వచ్చేసిన వరుణుడు.. ఆగిన ఆట

ABN, First Publish Date - 2022-07-03T22:41:36+05:30

భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న ఐదో వన్డేకు తొలి రోజు నుంచి అడ్డు తగులుతున్న వరుణుడు మూడో రోజైన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బర్మింగ్‌హామ్: భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న ఐదో వన్డేకు తొలి రోజు నుంచి అడ్డు తగులుతున్న వరుణుడు మూడో రోజైన నేడు కూడా మళ్లీ ప్రత్యక్షమయ్యాడు. ప్రతి రోజూ సరిగ్గా లంచ్‌కు ముందు వచ్చేస్తూ మ్యాచ్‌ను అడ్డుకుంటున్నాడు. ఓవర్‌నైట్ స్కోరు 84/5తో మూడో రోజు తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ (England) నిలకడగా ఆడుతూ వికెట్లు పోకుండా జాగ్రత్త పడింది. బోన్‌స్టోక్స్‌ (Ben Stokes)తో కలిసి బెయిర్‌స్టో (Jonny Bairstow) ఇన్నింగ్స్‌ను రిపేర్ చేశాడు.


కష్టాల్లో ఉన్న జట్టును గట్టెక్కించే ప్రయత్నం చేశాడు. నిదానంగా ఆడుతూ ఇద్దరూ కలిసి 65 పరుగులు జోడించాక శార్దూల్ ఠాకూర్ (Shardul Thakur) బౌలింగులో బుమ్రాకు క్యాచ్ ఇచ్చి స్టోక్స్ (25) అవుటయ్యాడు. క్రీజులోకి వచ్చిన శామ్ బిల్లింగ్స్‌ (Sam Billings)తో కలిసి బెయిర్‌స్టో సమయోచితంగా ఆడుతూ స్కోరుబోర్డుపై పరుగులు పెంచుకుంటూ పోయాడు. మరోవైపు, సెంచరీకి చేరువయ్యాడు. ఈ క్రమంలో 45.3 ఓవర్ల వద్ద వరుణుడు ప్రత్యక్షమైపోయాడు. దీంతో అంపైర్లు లంచ్ బ్రేక్ ప్రకటించారు. ఆట ఆగే సమయానికి ఇంగ్లండ్ 6 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. బెయిర్‌స్టో 91, బిల్లింగ్స్ 7 పరుగులతో క్రీజులో ఉన్నారు.  

Updated Date - 2022-07-03T22:41:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising