ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Rafa Nadal and Gabriela Sabatini: రెండు కళ్లూ సరిపోలేదు! టెన్నిస్ ప్రపంచాన్ని మళ్లీ ఉర్రూతలూగించిన సబటిని

ABN, First Publish Date - 2022-11-24T17:12:52+05:30

గాబ్రియెల సబటిని.. ఈ తరానికి పెద్దగా పరిచయం లేని టెన్నిస్ స్టార్ పేరిది. 1980, 90 దశకంలో సబటిని టెన్నిస్ ప్రపంచాన్ని ఉర్రూతలూగించింది

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: గాబ్రియెల సబటిని.. ఈ తరానికి పెద్దగా పరిచయం లేని టెన్నిస్ స్టార్ పేరిది. 1980, 90 దశకంలో సబటిని టెన్నిస్ ప్రపంచాన్ని ఉర్రూతలూగించింది. ప్రపంచ మాజీ నంబరు 3 అయిన సబటిని (Gabriela Sabatini)కి ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది అభిమానులున్నారు. టెన్నిస్‌ నుంచి తప్పుకోవడం, కొత్తతరం రాకతో ఆమె పేరు మరుగున పడినా అభిమానులు మాత్రం ఆమెను మర్చిపోలేదు. తాజాగా, మళ్లీ ఆమె రాకెట్ పట్టింది. టెన్నిస్ ప్రపంచాన్ని సంభ్రమాశ్చర్యంలో ముంచెత్తింది. రఫా నాదల్‌ (Rafa Nadal)తో కలిసి మిక్స్‌డ్ డబుల్స్ ఆడిన సబటిని విజయాన్ని కూడా అందుకుంది. ఈ చారిత్రక క్షణాలకు దక్షిణ అమెరికాలోని అర్జెంటినా వేదికైంది.

ప్రపంచ నంబర్ 3 రూడ్‌(Ruud)తో కలిసి అర్జెంటినాలో ఎగ్జిబిషన్ టూర్‌లో పాల్గొంటానని మొదటి బిడ్డ పుట్టడానికి ముందు నాదల్ ధ్రువీకరించాడు. నాదల్ ప్రకటనతో దక్షిణ అమెరికాలోని టెన్నిస్ అభిమానులు సంతోషంలో మునిగిపోయారు. తాము ఎంతగానో ఆరాధించే ఆటగాళ్లను చూడబోతున్నందుకు ఆనందంలో మునిగిపోయారు.

మరోవైపు, నిన్నటి తరం టెన్నిస్ తార గాబ్రియెల్ సబటిని సోషల్ మీడియాలో ఓ పోస్టును షేర్ చేస్తూ.. ఈ టూర్‌లో నాదల్‌తో కలిసి మిక్స్‌డ్ డబుల్స్ ఆడేందుకు సిద్ధంగా ఉన్నట్టు ఆఫర్ ప్రకటించారు. ఈ ఆఫర్‌కు వెంటనే అంగీకరించిన నాదల్ ఎగ్జిబిషన్ మ్యాచ్‌లో రూడ్-గిసెలా డులో (Gisela Dulo) జంటతో తలపడేందుకు ఓకే చెప్పాడు. దీంతో మ్యాచ్‌కు మరింత ఆకర్షణ వచ్చింది. 52 ఏళ్ల సబటిని రాకెట్ పట్టుకుని కోర్టులోకి వస్తుంటే ప్రేక్షకుల నుంచి అనూహ్య స్పందన లభించింది. కరతాళ ధ్వనులతో ఆమెకు స్వాగతం పలికారు. సబటిని మళ్లీ రాకెట్ పట్టుకోగా చూస్తామని కలలో కూడా అనుకోని అభిమానులు కేరింతలతో తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఫొటోలు, వీడియోలు తీస్తూ ముచ్చపట్టడారు. ఈ మ్యాచ్‌లో నాదల్-సబటిని జంట 6-4 తేడాతో విజయం సాధించింది.

Updated Date - 2022-11-24T17:12:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising