ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రదుకాను ముందంజ

ABN, First Publish Date - 2022-01-19T08:49:44+05:30

బ్రిటన్‌ టీనేజ్‌ సంచలనం ఎమ్మా రదుకాను.. ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో శుభారంభం చేసింది. సబలెంక, హలెప్‌, మెద్వెదెవ్‌, మర్రే రెండో రౌండ్‌కు చేరుకున్నారు. కాగా, జర్మన్‌..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మెల్‌బోర్న్‌: బ్రిటన్‌ టీనేజ్‌ సంచలనం ఎమ్మా రదుకాను.. ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో శుభారంభం చేసింది. సబలెంక, హలెప్‌, మెద్వెదెవ్‌, మర్రే రెండో రౌండ్‌కు చేరుకున్నారు. కాగా, జర్మన్‌ స్టార్‌ ఏంజెలిక్‌ కెర్బర్‌కు తొలి రౌండ్‌లోనే షాక్‌ తగిలింది. మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్‌ మొదటి రౌండ్‌లో 17వ సీడ్‌ రదుకాను 6-0, 2-6, 6-1తో స్లోన్‌ స్టీఫెన్స్‌పై గెలిచింది. రెండో సీడ్‌ సబలెంక 5-7, 6-3, 6-2తో శాండర్స్‌పై, మూడో సీడ్‌ ముగురుజ 6-3, 6-4తో కార్లా బురెల్‌పై, రొమేనియా భామ హలెప్‌ 6-4, 6-3తో మగ్దలీనాపై, 10వ సీడ్‌ పావ్‌ల్యుచెన్‌కొవా 6-2, 6-1తో అన్నే బోండార్‌పై గెలిచారు. 16వ సీడ్‌ కెర్బర్‌ 4-6, 3-6తో కియా కనేపి చేతిలో, చెక్‌ ప్లేయర్‌ క్విటోవా 2-6, 2-6తో సొరానా క్రిస్టియా చేతిలో, కెనడా చిన్నది లైలా అన్నె ఫెర్నాండెజ్‌ 4-6, 2-6తో మాడిసన్‌ ఇంగ్లిస్‌ చేతిలో పరాజయం పాలయ్యారు.

 

మర్రే.. ఎన్నాళ్లకు..: వైల్డ్‌కార్డ్‌ ఎంట్రీ ఆండీ మర్రే.. ఐదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత గెలుపు నమోదు చేశాడు. తొలి రౌండ్‌లో బ్రిటన్‌ ఆటగాడు మర్రే 6-1, 3-6, 6-4, 6-7 (5), 6-4తో 21వ సీడ్‌ నికొలోజ్‌ బసిలా్‌షవిలిపై ఐదు సెట్లపాటు పోరాడి నెగ్గాడు. 2017 తర్వాత ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో మర్రే మ్యాచ్‌ నెగ్గడం ఇదే తొలిసారి. గ్రీకు వీరుడు సిట్సిపాస్‌ 6-2, 6-4, 6-3తో మైకేల్‌ యమర్‌పై, రెండో సీడ్‌ మెద్వెదెవ్‌ 6-1, 6-4, 7-6(3)తో హెన్రీ లోక్సోనెన్‌పై నెగ్గారు.

Updated Date - 2022-01-19T08:49:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising