ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

క్వింటన్ డికాక్ సెంచరీ.. భారీ స్కోరు దిశగా దక్షిణాఫ్రికా

ABN, First Publish Date - 2022-01-23T22:10:15+05:30

భారత్‌తో జరుగుతున్న నామమాత్రపు చివరి వన్డేలో దక్షిణాఫ్రికా దూకుడుగా ఆడుతోంది. ఓపెనర్ క్వింటన్ డికాక్ శతకంతో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కేప్‌టౌన్: భారత్‌తో జరుగుతున్న నామమాత్రపు చివరి వన్డేలో దక్షిణాఫ్రికా దూకుడుగా ఆడుతోంది. ఓపెనర్ క్వింటన్ డికాక్ శతకంతో అదరగొట్టాడు. 70 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన దశలో జట్టు భారాన్ని తన భుజాలపై వేసుకున్న డికాక్.. సంయమనంతో ఆడుతూ వికెట్ల పతనానికి అడ్డుకట్ట వేశాడు.


ఈ క్రమంలో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న డికాక్.. అదే ఊపుతో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మొత్తంగా 108 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లతో శతకాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. వన్డేల్లో డికాక్‌కు ఇది 17 సెంచరీ కాగా, ఇండియాపై ఆరోది. క్రీజులో అతడికి తోడుగా డుసెన్ ఉన్నాడు. ఇద్దరూ కలిసి భారత బౌలర్లను ఎలాంటి తడబాటు లేకుండా ఎదుర్కొంటూ పరుగులు రాబడుతున్నారు.


అంతకుముందు ఓపెనర్ జానెమన్ మలాన్ (1), మార్కరమ్ (15)లను దీపక్ చాహర్ పెవిలియన్ పంపాడు. కెప్టెన్ తెంబా బవుమా(8) రనౌట్ అయ్యాడు. కాగా, ఇప్పటికే తొలి రెండు వన్డేలను గెలుచుకున్న దక్షిణాఫ్రికా సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లోనూ నెగ్గి వైట్ వాష్ చేయాలని భావిస్తుండగా, గెలిచి పరువు కాపాడుకోవాలని భారత్ పట్టుదలగా ఉంది.  ప్రస్తుతం 33 ఓవర్లు ముగిశాయి. ఆతిథ్య జట్టు మూడు వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. డికాక్ 110, డుసెన్ 48 పరుగులతో క్రీజులో ఉన్నారు. 

Updated Date - 2022-01-23T22:10:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising