ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఓటమితో ఇంటికి

ABN, First Publish Date - 2022-05-23T10:18:19+05:30

ఈ ఏడాది ఐపీఎల్‌ను సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఓటమితో ముగించింది. ప్లేఆఫ్స్‌ రేసు నుంచి ఈపాటికే అవుటైన జట్ల మధ్య ఆదివారం జరిగిన నామమాత్రపు లీగ్‌..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సన్‌రైజర్స్‌పై పంజాబ్‌ గెలుపు 

ముంబై: ఈ ఏడాది ఐపీఎల్‌ను సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఓటమితో ముగించింది. ప్లేఆఫ్స్‌ రేసు నుంచి ఈపాటికే అవుటైన జట్ల మధ్య ఆదివారం జరిగిన నామమాత్రపు లీగ్‌ మ్యాచ్‌లో పంజాబ్‌ 5 వికెట్లతో హైదరాబాద్‌పై గెలిచింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న హైదరాబాద్‌ నిర్ణీత 20 ఓవర్లలో 157/8 స్కోరు చేసింది. ఓపెనర్‌ అభిషేక్‌ (32 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 43), త్రిపాఠి (20) రెండో వికెట్‌కు 47 పరుగులు జోడించి ఆదుకున్నారు.


డెత్‌లో షెప్పర్డ్‌ (26 నాటౌట్‌), సుందర్‌ (25) 6వ వికెట్‌కు 29 బంతుల్లో 58 పరుగుల భాగస్వామ్యంతో గౌరవప్రద స్కోరు అందించారు. ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ హర్‌ప్రీత్‌ బ్రార్‌, నాథన్‌ ఎల్లీస్‌ చెరో 3 వికెట్లు పడగొట్టాడు. అనంతరం ఛేదనలో పంజాబ్‌ 15.1 ఓవర్లలో 5 వికెట్లకు 160 పరుగులు చేసి నెగ్గింది. లివింగ్‌స్టోన్‌ (49 నాటౌట్‌), ధవన్‌ (39) రాణించారు. ఫారూకీ రెండు వికెట్లు పడగొట్టాడు. 14 మ్యాచ్‌ల నుంచి పంజాబ్‌ 14 పాయింట్లతో ఆరో స్థానంలో, 12 పాయింట్లతో సన్‌రైజర్స్‌ ఎనిమిదో స్థానంలో నిలిచాయి. 

Updated Date - 2022-05-23T10:18:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising