ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చెలరేగిన పంజాబ్ కింగ్స్.. ముంబైకి భారీ టార్గెట్

ABN, First Publish Date - 2022-04-14T03:00:46+05:30

పుణె : టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ కింగ్స్ బ్యాట్స్‌మెన్ రాణించారు. ముంబై ఇండియన్స్‌కు 198 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పుణె : టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ కింగ్స్ బ్యాట్స్‌మెన్ రాణించారు. ముంబై ఇండియన్స్‌కు 198 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించారు. పంజాబ్ కింగ్స్ ఓపెనర్లు మయాంక్ అగర్వాల్, శిఖర్ ధవన్ మొదటి వికెట్‌కు 97 పరుగుల చక్కటి భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. జట్టు స్కోరు 97 పరుగుల వద్ద మయాంక్ అగర్వాల్(52) మురుగన్ అశ్విన్ బౌలింగ్‌లో సూర్యకుమార్ యాదవ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. శిఖర్ ధవన్(70 పరుగులు) చేసి బసిల్ తంపి బౌలింగ్‌లో పొలార్డ్‌కు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు.


జానీ బెయిర్‌స్టో 12 పరుగులు, ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన లియామ్ లివింగ్ స్టోన్ కేవలం 2 పరుగులు మాత్రమే చేశారు. లివింగ్ స్టోన్ బూమ్రా బౌలింగ్‌లో ఔటయ్యాడు. అయితే చివరిలో జితేష్ శర్మ చెలరేగి ఆడి జట్టు స్కోర్‌ను పరుగులు పెట్టించాడు. కేవలం 15 బంతుల్లోనే 30 పరుగులు కొట్టి నాటౌట్‌గా నిలిచాడు. మరో బ్యాట్స్‌మెన్ షారుక్ ఖాన్ 15 పరుగుల వద్ద వెనుదిరగగా.. ఒడియాన్ స్మిత్ 1 పరుగుతో నాటౌట్‌గా నిలిచాడు. ముంబై బౌలర్లలో బసిల్ తంపి 2 వికెట్లు, జయ్‌దేవ్, బూమ్రా, మురుగన్ అశ్విన్ తలో వికెట్ చొప్పున తీశారు.

Updated Date - 2022-04-14T03:00:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising