ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Shikar Dhavanను చితకబాదిన కన్నతండ్రి.. కారణం ఇదే..

ABN, First Publish Date - 2022-05-26T22:13:04+05:30

తప్పు చేసిన పిల్లాడిని సవ్యమైన మార్గంలో నడిపిచేందుకు కన్నతండ్రి ఏవిధంగానైతే చేయి చేసుకుంటాడో.. అచ్చం అదేరీతిలో ఇండియన్ క్రికెటర్ శిఖర్ ధవన్‌ను వాళ్ల నాన్న తీవ్రంగా కొట్టాడు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : తప్పు చేసిన పిల్లాడిని సవ్యమైన మార్గంలో నడిపిచేందుకు కన్నతండ్రి ఏవిధంగానైతే  చేయి చేసుకుంటాడో.. అచ్చం అదేరీతిలో ఇండియన్ క్రికెటర్ శిఖర్ ధవన్‌ను(Shikar Dhavan) వాళ్ల నాన్న మహేంద్రపాల్ ధవన్(mahendrapal Dhavan) తీవ్రంగా కొట్టాడు. కుటుంబ సభ్యులు అడ్డుపడుతున్నా ఆగకుండా చెంపలు చెళ్లుమనిపించాడు. అంతటితోనూ ఆగక కిందపడేసి మరీ కాళ్లు, చేతులతో కుమ్మిపడేశారు. ఇంట్లో నుంచి వెళ్లగొట్టినంత పనిచేశారు. 36 ఏళ్ల వయసొచ్చిన కొడుకు, అందునా టీమిండియా క్రికెటర్‌గా గౌరవమర్యాదలు ఉన్న ధవన్‌ని ఎందుకింతలా కొడుతున్నారో తెలుసా... ఐపీఎల్ 2022(IPL2022) నుంచి పంజాబ్ కింగ్స్(Punjab kings) నిష్క్రమించినందుకు ఆగ్రహంతో ఈ పని చేశాడు. అయ్యయ్యో.. టీం రాణించనప్పుడు ధవన్ మాత్రం ఏం చేస్తాడులే అని జాలి పడుతున్నారా..  అవసరం లేదులెండి. ఎందుకంటే పంజాబ్ కింగ్స్ టోర్నీ నుంచి వైదొలగడంతో నైరాశ్యంలో ఉన్న ఫ్యాన్స్‌కు వినోదాన్ని పంచడం, నవ్వించే ప్రయత్నంగా శిఖర్ ధవన్ కుటుంబ సభ్యులు చేసిన సరదా వీడియో ఇది. ఈ వీడియోను బుధవారం ఇన్‌స్టాగ్రామ్‌లో ధవన్ పోస్ట్ చేశాడు. ‘ ప్లే ఆఫ్స్‌కి చేరకపోవడంతో మా నాన్న గెంటేశాడు’ అని వీడియోకి ట్యాగ్ ఇచ్చాడు. కాగా ఇలాంటి సరదా వీడియోలను పోస్ట్ చేయడం ధవన్‌కి కొత్తేం కాదు. గతంలోనూ పలు వీడియోలు పంచుకున్నాడు. ఫ్యాన్స్‌ను కుషీ చేసేందుకు రెగ్యులర్‌గా రీల్స్ చేస్తుంటాడు. ఆ వీడియోల్లో అప్పుడప్పుడు అతడి కుటుంబ సభ్యులు కూడా కనిపిస్తుంటారు. 


కాగా ఐపీఎల్-2022లో పంజాబ్ కింగ్స్ విషయానికి వస్తే.. మొత్తం 14 మ్యాచ్‌లు ఆడిన ఈ జట్టు 7 మ్యాచ్‌లు గెలిచి.. ఏడింట్లో ఓటమిపాలైంది. ఈ సీజన్‌లో పంజాబ్ తరపున 14 మ్యాచ్‌లు ఆడిన శిఖర్ ధవన్ 453 పరుగులు చేశాడు. చక్కటి ఫామ్‌లో ఉన్నప్పటికీ తదుపరి సీరిస్‌కు ధవన్‌ను బీసీసీఐ సెలక్టర్లు ఎంపిక చేయలేదు. ఎంపిక చేయకపోవడానికి కారణం ఏంటో ధవన్‌కు మేనేజ్‌మెంట్ తెలియజేసిందని సమాచారం.

Updated Date - 2022-05-26T22:13:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising