ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పుజార, రహానెలకు ‘బి’ గ్రేడ్‌?

ABN, First Publish Date - 2022-01-27T07:08:41+05:30

బ్యాటింగ్‌లో వరుసగా విఫలమవుతున్న సీనియర్లు చటేశ్వర్‌ పుజార, అజింక్యా రహానెల సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ గ్రేడ్‌ దిగజారే అవకాశం ఉంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: బ్యాటింగ్‌లో వరుసగా విఫలమవుతున్న సీనియర్లు చటేశ్వర్‌ పుజార, అజింక్యా రహానెల సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ గ్రేడ్‌ దిగజారే అవకాశం ఉంది. గతేడాది ప్రదర్శన ఆధారంగా సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ గ్రేడ్‌లను బీసీసీఐ నిర్ణయిస్తుంది. ఈ నేపథ్యంలో పుజార, రహానెలను ‘ఎ’ గ్రేడ్‌లో తొలగించి ‘బి’ గ్రేడ్‌ కాంట్రాక్ట్‌ ఇవ్వనున్నట్టు విశ్వసనీయ సమాచారం. పేసర్‌ ఇషాంత్‌ శర్మ కాంట్రాక్ట్‌ స్థాయి కూడా దిగజారే చాన్సులున్నాయి. కాగా, కోహ్లీ, బుమ్రా, రోహిత్‌ శర్మకు ఎ+.. రాహుల్‌, రిషభ్‌ పంత్‌, షమి, అశ్విన్‌లకు ఎ గ్రేడ్‌ కాంట్రాక్ట్‌లు దక్కనున్నట్టు బోర్డు అధికారి ఒకరు తెలిపారు. త్వరలో బీసీసీఐ వీటిపై ప్రకటన చేస్తుందని చెప్పారు. స్వదేశంలోనూ విదేశాల్లోనూ పేలవ ప్రదర్శన కనబరుస్తున్న పుజార, రహానె జట్టుకు భారంగా మారారు. వీరి కెరీర్‌ దాదాపుగా ముగిసినట్టేనని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 

Updated Date - 2022-01-27T07:08:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising