ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చల్లని ఆహారమా.. తినలేం!

ABN, First Publish Date - 2022-10-27T05:23:58+05:30

ప్రాక్టీస్‌ సెషన్స్‌లో పాల్గొనే భారత జట్టు ఆటగాళ్లకు సర్వ్‌ చేస్తున్న ఆహారంపై కొందరు అసంతృప్తిగా ఉన్నట్టు సమాచారం. మంగళవారం నెట్‌ సెషన్‌ ముగిసిన తర్వాత చల్లటి శాండ్‌విచ్‌లు,

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మెనూపై టీమిండియా ఆటగాళ్ల అసంతృప్తి

సిడ్నీ: ప్రాక్టీస్‌ సెషన్స్‌లో పాల్గొనే భారత జట్టు ఆటగాళ్లకు సర్వ్‌ చేస్తున్న ఆహారంపై కొందరు అసంతృప్తిగా ఉన్నట్టు సమాచారం. మంగళవారం నెట్‌ సెషన్‌ ముగిసిన తర్వాత చల్లటి శాండ్‌విచ్‌లు, ఫెలాఫెల్‌ (బఠానీ, బీన్స్‌ కలిపి ఫ్రై చేసిన వంటకం) వడ్డించడంతో.. కొందరు టీమిండియా క్రికెటర్లు వాటిని తినేందుకు విముఖత వ్యక్తం చేశారట. భారత ఆటగాళ్లు వేడి ఆహారాన్ని ఇష్టపడతారని.. అయితే అవి చల్లగా ఉండడంతో స్వీకరించలేదని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. అయితే, అన్ని జట్లకూ ఐసీసీ ఇదే మెనూను ఇస్తోందని ఆయన చెప్పారు.

‘ఇదేమీ బాయ్‌కాట్‌ కాదు. కొంత మంది పండ్లు, ఫెలాఫెల్‌ తిన్నారు. హోటల్‌కు వెళ్లి లంచ్‌ చేయాలని ఎక్కువ మంది భావించార’ని బోర్డు అధికారి పేర్కొన్నారు. భారత ఆటగాళ్ల ఇబ్బందులను తెలుసుకొన్న ఐసీసీ.. సమస్యను పరిష్కరించడానికి తగిన చర్యలు తీసుకోనున్నట్టు చెప్పింది. కాగా, టీమిండియా ప్రాక్టీ్‌సకు కేటాయించిన ప్రదేశం సిడ్నీకి 40 కిలో మీటర్ల దూరంలో ఉండడంతో.. బుధవారం ఆటగాళ్లు నెట్స్‌లో పాల్గొనలేదు.

Updated Date - 2022-10-27T05:24:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising