ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లివింగ్‌స్టోన్ వీరబాదుడు.. పవర్‌‌ప్లేలో రెండో అత్యధిక స్కోరు నమోదు

ABN, First Publish Date - 2022-04-04T01:52:31+05:30

చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ బ్యాట్‌తో చెలరేగిపోతోంది. లియామ్ లివింగ్ స్టోన్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై: చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ బ్యాట్‌తో చెలరేగిపోతోంది. లియామ్ లివింగ్ స్టోన్ దూకుడుతో పంజాబ్ స్కోరు పరుగులు తీస్తోంది. ఫలితంగా ఈ ఐపీఎల్‌లో రెండో అత్యధిక పవర్ ప్లే స్కోరు నమోదైంది. ముంబైలోని బ్రాబౌర్న్ స్టేడియంలో లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ పవర్ ప్లేలో ఒక వికెట్ నష్టానికి 73 పరుగులు చేసింది. ఇప్పుడు అదే స్టేడియంలో చెన్నైపై పంజాబ్ కింగ్స్ రెండు వికెట్ల నష్టానికి 72 పరుగులు చేసి పవర్‌ప్లేలో రెండో అత్యధిక స్కోరు నమోదు చేసింది.


ఈ మ్యాచ్‌లో తొలి రెండు ఓవర్లలోనే మయాంక్ అగర్వాల్ (4), భానుక రాజపక్స (9) అవుటయ్యారు. దీంతో పంజాబ్ ఒత్తిడిలోకి జారుకున్నట్టు కనిపించింది. అయితే, లివింగ్‌స్టోన్ క్రీజులోకి వచ్చాక ఆట స్వరూపం పూర్తిగా మారిపోయింది. ఫోర్లు, సిక్సర్లతో బౌలర్లపై నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడ్డాడు. స్టేడియం నలువైపులా బంతులను తరలిస్తూ ప్రేక్షకులను ఉర్రూతలూగించాడు.  ప్రస్తుతం 8 ఓవర్లు ముగిశాయి. పంజాబ్ రెండు వికెట్ల నష్టానికి 89 పరుగులు చేసింది. లివింగ్ స్టోన్  47(22 బంతుల్లో నాలుగు పోర్లు, 4 సిక్సర్లు), శిఖర్ ధావన్ 23 (19 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్)  పరుగులతో క్రీజులో ఉన్నారు. 

Updated Date - 2022-04-04T01:52:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising