ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

21.. వేటలో జొకో

ABN, First Publish Date - 2022-05-22T09:28:18+05:30

ప్రపంచ నెంబర్‌వన్‌ నొవాక్‌ జొకోవిచ్‌ 21వ గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌పై గురిపెట్టాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మ. 2.30 నుంచి  సోనీ సిక్స్‌లో..

ఒకే పార్శ్వంలో నొవాక్‌, నడాల్‌

ఫ్రెంచ్‌ ఓపెన్‌ నేటి నుంచే

పారిస్‌: ప్రపంచ నెంబర్‌వన్‌ నొవాక్‌ జొకోవిచ్‌ 21వ గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌పై గురిపెట్టాడు. ఆదివారం నుంచి జరిగే ఫ్రెంచ్‌ ఓపెన్‌లో డిఫెండింగ్‌ చాంప్‌ జొకో టాప్‌ సీడ్‌గా బరిలోకి దిగుతున్నాడు. అయితే, అతడికి 13 సార్లు ఫ్రెంచ్‌ ఓపెన్‌ విజేత, ఐదో సీడ్‌ రఫెల్‌ నడాల్‌ (స్పెయిన్‌) నుంచి గట్టిపోటీ ఎదురవనుంది. వీరిద్దరూ ఒకే పార్శ్వంలో ఉండడంతో.. క్వార్టర్స్‌లో ఒకరికొకరు పోటీపడే అవకాశం ఉంది. వ్యాక్సిన్‌ తీసుకోని కారణంగా ఈ ఏడాది ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌కు నొవాక్‌ దూరం కాగా.. నడాల్‌ ఆ టోర్నీలో విజేతగా నిలిచాడు. మరోవైపు 35 ఏళ్ల రఫా ఫిట్‌నెస్‌ ఆందోళన కలిగిస్తోంది. తొలి రౌండ్‌లో నిషియోగకతో జొకో, థాంప్సన్‌తో రఫా తలపడనున్నారు. రెండో సీడ్‌ మెద్వెదెవ్‌, జ్వెరెవ్‌, సిట్సిపాస్‌, రుబ్లేవ్‌ కూడా టైటిల్‌పై కన్నేశారు. నొవాక్‌ ఈ టోర్నీ నెగ్గితే.. అత్యధికంగా 21 గ్రాండ్‌స్లామ్‌లు నెగ్గిన నడాల్‌ రికార్డును సమం చేస్తాడు. 


ఫేవరెట్‌గా స్వియాటెక్‌:

మహిళల సింగిల్స్‌లో పోలెండ్‌ ప్లేయర్‌ ఇగా స్వియాటెక్‌ హాట్‌ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. బార్టీ రిటైర్మెంట్‌తో నెం:1 ర్యాంక్‌ను సొంతం చేసుకున్న స్వియాటెక్‌.. ఇటీవలి కాలంలో మంచి ఫామ్‌లో ఉంది. తొలి రౌండ్‌లో క్వాలిఫయర్‌తో స్వియాటెక్‌ తలపడనుంది. కాగా, ఆమెకు డిఫెండింగ్‌ చాంప్‌ క్రజికోవా, సక్కారీ, ఒసాక, హలెప్‌ నుంచి పోటీ ఇవ్వనున్నారు. 

Updated Date - 2022-05-22T09:28:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising