ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Nikhat Zareen: కామన్వెల్త్‌లో క్వార్టర్‌ఫైనల్స్‌కు చేరిన తెలంగాణ బాక్సర్

ABN, First Publish Date - 2022-08-01T02:26:39+05:30

ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్ గోల్డ్ మెడలిస్ట్, తెలంగాణకు చెందిన నిఖత్ జరీన్ (Nikhat Zareen) కామన్వెల్త్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బర్మింగ్‌హామ్: ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్ గోల్డ్ మెడలిస్ట్, తెలంగాణకు చెందిన నిఖత్ జరీన్ (Nikhat Zareen) కామన్వెల్త్ గేమ్స్‌ (Commonwealth Games)లోనూ సత్తా చాటుతోంది. 50 కేజీల లైట్‌వెయిట్ కేటగిరీలో మొజాంబిక్‌ బాక్సర్ హెలేనా ఇస్మాయిల్ బగవో (Helena Ismael Bagao)ను చిత్తు చేసి క్వార్టర్స్‌కు చేరుకుంది. అనుభవాన్ని రంగరించి ఎటాకింగ్‌‌తో విరుచుకుపడి ప్రత్యర్థిని మట్టికరిపించింది. 


తొలి రౌండ్‌లలో ఇస్మాయిల్‌ కొంత ఆధిపత్యం ప్రదర్శించినప్పటికీ చివరి రౌండ్‌లలో జరీన్ చెలరేగిపోయింది. ప్రత్యర్థి ముఖంపై క్లీన్ పంచ్‌లతో గుక్కతిప్పుకోనివ్వకుండా చేసింది. ఫలితంగా మరో 48 సెకన్లు ఉండగానే రిఫరీ బౌట్‌ను రద్దు చేసి జరీన్‌ను విజేతగా ప్రకటించాడు. కామన్వెల్త్ గేమ్స్ కాంస్య పతక విజేత, న్యూజిలాండ్‌కు చెందిన ట్రాయ్ గార్టన్‌ (Troy Garton)తో జరీన్ క్వార్టర్స్‌లో తలపడుతుంది.  

Updated Date - 2022-08-01T02:26:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising