ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వావ్‌.. నిఖత్‌

ABN, First Publish Date - 2022-05-17T09:37:22+05:30

తెలుగమ్మాయి నిఖత్‌ జరీన్‌ ప్రపంచ మహిళల బాక్సింగ్‌ చాంపియన్‌షి్‌పలో సత్తా చాటుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సెమీస్‌ చేరిన తెలుగు బాక్సర్‌

ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పతకం ఖాయం

న్యూఢిల్లీ: తెలుగమ్మాయి నిఖత్‌ జరీన్‌ ప్రపంచ మహిళల బాక్సింగ్‌ చాంపియన్‌షి్‌పలో సత్తా చాటుతోంది. టర్కీలోని ఇస్తాంబుల్‌లో సోమవారం జరిగిన 52 కిలోల విభాగం బౌట్‌లో నిఖత్‌ సెమీఫైనల్‌కు దూసుకెళ్లి పతకాన్ని ఖాయం చేసుకుంది. నిఖత్‌తో పాటు మరో ఇద్దరు భారత బాక్సర్లు మనీషా (57 కిలోలు), పర్వీన్‌ (63 కిలోలు) సెమీ్‌సలో ప్రవేశించి పతకాలను ఖాతాలో వేసుకున్నారు. క్వార్టర్స్‌ బౌట్‌లో నిజామాబాద్‌ అమ్మాయి నిఖత్‌ 5-0తో చార్లీ సియాన్‌ (ఇంగ్లండ్‌)ను చిత్తుగా ఓడించింది. మరో బౌట్‌లో పర్వీన్‌ 5-0తో జుల్కనరోవా (తజకిస్థాన్‌)పై, మనీషా 4-1తో మోన్‌ఖోర్‌ (మంగోలియా)పై విజయం సాధించారు. 25 ఏళ్ల నిఖత్‌ ఫైనల్‌ బెర్త్‌ కోసం కరోలిన్‌ డీ అల్మిదా (బ్రెజిల్‌)తో అమీతుమీ తేల్చుకోనుంది. సెమీస్‌లో ఓడినా కనీసం కాంస్యం దక్కుతుంది. మిగతా భారత బాక్సర్లలో నీతూ (48 కి), పూజా రాణి (81 కి) క్వార్టర్స్‌లో ఓడి ఇంటిబాట పట్టారు.

Updated Date - 2022-05-17T09:37:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising