ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మీరు ప్రత్యేక రాయబారులు

ABN, First Publish Date - 2022-01-27T07:05:30+05:30

దేశం 73వ గణతంత్ర వేడుకలు జరుపుకొంటున్న వేళ ప్రధాని మోదీ ప్రముఖ క్రికెటర్లు జాంటీ రోడ్స్‌, క్రిస్‌ గేల్‌కు ప్రత్యేకంగా లేఖలు రాశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: దేశం 73వ గణతంత్ర వేడుకలు జరుపుకొంటున్న వేళ ప్రధాని మోదీ ప్రముఖ క్రికెటర్లు జాంటీ రోడ్స్‌, క్రిస్‌ గేల్‌కు ప్రత్యేకంగా లేఖలు రాశారు. వారిద్దరికి భారతదేశంతో ఉన్న అవినాభావ సంబంధాలను ఆ లేఖలో ప్రస్తావిస్తూ..వారిని ప్రత్యేక రాయబారులుగా అభివర్ణించారు. దక్షిణాఫ్రికాకు చెందిన రోడ్స్‌ ఐపీఎల్‌ జట్టు ముంబై ఇండియన్స్‌కు గతంలో ఫీల్డింగ్‌ కోచ్‌గా వ్యవహరించాడు. ఈక్రమంలో అతడు ఏడాదిలో ఎక్కువకాలం భారత్‌లోనే ఉండేవాడు. అంతేకాదు..తన కుమార్తెకు ‘ఇండియా’ అని పేరుపెట్టి భారత్‌పై తనకున్న మమకారాన్ని రోడ్స్‌ చాటుకున్నాడు. వెస్టిండీ్‌సకు చెందిన గేల్‌ ఐపీఎల్‌లో తన మెరుపులతో ఎలా ఉర్రూతలూగించిందీ విదితమే. ‘మీకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. భారత్‌తో, ఈ దేశ సంస్కృతితో మీకు అవినాభావ సంబం ధం ఉందన్న విషయం నాకు తెలుసు. ఎంతో గొప్పదైన ఈ దేశం పేరును మీ కుమార్తెకు పెట్టారంటే భారత్‌పై మీకు న్న అభిమానాన్ని తెలియజేస్తుంది. భారత్‌, దక్షిణాఫ్రికా మధ్య సంబంధాలు పటుతరం కావడంలో మీరు ప్రత్యేక రాయబారిగా వ్యవహరించారు’ అని రోడ్స్‌కు రాసిన లేఖలో మోదీ ప్రశంసించారు. దీనికి రోడ్స్‌ స్పందిస్తూ మోదీకి కృతజ్ఞతలు తెలిపాడు. అలాగే క్రిస్‌ గేల్‌ కూడా ప్రధాని లేఖకు స్పందిస్తూ...‘భారతీయులకు శుభాకాంక్షలు. భారత్‌తో నాకున్న సంబంధాలను ప్రధాని మోదీ గుర్తు చేస్తూ పంపిన లేఖతో ఈరోజు నిద్ర లేచా. యూనివర్స్‌ బాస్‌నుంచి కంగ్రాట్స్‌’ అని గేల్‌ ట్వీట్‌ చేశాడు. 

Updated Date - 2022-01-27T07:05:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising